PAK Vs NZ: క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు పాక్‌కు దెబ్బ.. 18 ఏళ్ల తరువాత ఇలా..

PAK Vs NZ 1st Test Match Highlights: పాకిస్థాన్ జట్టు వరుస ఓటముల నుంచి బయటపడింది. న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ను డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్‌ ద్వారా నాలుగేళ్ల తరువాత టెస్ట్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు వికెట్ కీపర్ సర్ఫరాజ్‌ ఖాన్.   

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 31, 2022, 07:16 AM IST
  • పాకిస్థాన్, కివీస్ జట్ల మొదటి టెస్ట్ డ్రా
  • బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న సర్ఫరాజ్‌ ఖాన్
  • కీపింగ్‌లో అట్టర్ ఫ్లాప్.. పాక్‌కు పెనాల్టీ
PAK Vs NZ: క్రికెట్‌లో అరుదైన ఘటన.. ఒకే మ్యాచ్‌లో రెండుసార్లు పాక్‌కు దెబ్బ.. 18 ఏళ్ల తరువాత ఇలా..

PAK Vs NZ 1st Test Match Highlights: పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. టెస్టు క్రికెట్‌లో 18 ఏళ్ల క్రితం జరిగిన అలాంటి ఫీట్ ఈ మ్యాచ్‌లో జరిగింది. పాకిస్థాన్‌కు రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ పెనాల్టీ రూపంలో ఐదు పరుగులను సమర్పించుకుంది. పాక్ జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంతి పాక్ వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్ హెల్మెట్‌కు తగిలింది. ఈ విధంగా కివీస్ జట్టు రెండు ఇన్నింగ్స్‌లలో ఐదు పరుగుల పెనాల్టీని పొందింది. 

18 సంవత్సరాల క్రితం ఇలా..

ఇంతకుముందు 2004లో భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఇలాంటి ఘటన జరిగింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ వికెట్ కీపర్ హెల్మెట్‌కు బంతి తగిలింది. టెస్ట్ క్రికెట్‌లో 18 ఏళ్ల తర్వాత మరోసారి ఇలా జరిగింది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ బంతి వికెట్ కీపర్ హెల్మెట్‌కు తగలడంతో ప్రత్యర్థి జట్టుకు 5 పరుగుల పెనాల్టీ లభించింది.

నాలుగేళ్ల తిరిగి జట్టులోకి..

న్యూజిలాండ్‌తో జరిగిన ఈ తొలి టెస్టు మ్యాచ్‌లో సర్ఫరాజ్ అహ్మద్ దాదాపు నాలుగేళ్ల తర్వాత పాకిస్థాన్ జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మ్యాచ్‌లోని రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సర్ఫరాజ్ హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్ల సాయంతో 86 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు కొట్టి 53 రన్స్ చేశాడు. సర్ఫరాజ్‌కి ఇది 50వ టెస్టు మ్యాచ్. అంతకుముందు అతను తన చివరి టెస్ట్ మ్యాచ్‌ను 2019లో జనవరి 11వ తేదీన దక్షిణాఫ్రికాతో జోహన్నెస్‌బర్గ్‌లో ఆడాడు. ఆ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ కూడా చేశాడు. ఆ తరువాత జట్టులో స్థానం కోల్పోయాడు. 

మళ్లీ తిరిగివచ్చిన సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేశాడు. అయితే కీపింగ్‌లో మాత్రం విఫలమయ్యాడు. రెండు స్టంప్‌ ఔట్లు మిస్ చేయడంతోపాటు.. ఒక క్యాచ్ కూడా వదిలేశాడు. దీంతో సోషల్ మీడియాలో సర్ఫరాజ్‌పై మీమ్స్ పేలుతున్నాయి. ఇక ఈ మ్యాచ్‌ను డ్రా ముగించిన పాకిస్థాన్.. స్వదేశంలో వరుస ఓటములకు చెక్ పెట్టింది. అంతకుముందు స్వదేశంలో ఆ జట్టు వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఇందులో ఆస్ట్రేలియాతో ఒక మ్యాచ్, ఇంగ్లండ్‌తో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కోల్పోయింది. 

Also Read: 7th Pay Commission: కొత్త సంవత్సరానికి ముందే ఉద్యోగులకు శుభవార్త.. డీఏ 4 శాతం పెంచిన రాష్ట్ర ప్రభుత్వం  

Also Read: Rishabh Pant Car Accident: మూడేళ్ల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్‌.. పట్టించుకోని రిషబ్ పంత్!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News