Shakuntalam Release Date : శాకుంతలం రిలీజ్ డేట్.. దిల్ రాజు కావాలనే చేశాడా?

Samantha Shakuntalam Release Date సమంత నటించిన శాకుంతలం సినిమాకు సంబంధించిన షూటింగ్ అంతా ఎప్పుడో అయిపోయింది. అన్నపూర్ణలో వేసిన సెట్‌లోనే షూటింగ్ చేసేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌కి మాత్రం చాలానే టైం తీసుకున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 2, 2023, 01:02 PM IST
  • సమంత శాకుంతలం అప్డేట్
  • మూడు సినిమాలకు పోటీగా దిల్ రాజు
  • కావాలనే ఇలా చేస్తున్నాడా?
Shakuntalam Release Date : శాకుంతలం రిలీజ్ డేట్.. దిల్ రాజు కావాలనే చేశాడా?

Samantha Shakuntalam Release Date సినిమా వాళ్లు చెప్పేది ఒకటి చేసేది ఇంకొకటి అని అంటుంటారు. తెర మీద కనిపించేది ఒకటి.. దాని వెనుకుండేది మరొకటి అని చెబుతుంటారు. ఇప్పుడు దిల్ రాజు చేసింది కూడా అలానే కనిపిస్తోంది. మూడు సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్న డేట్‌ను ఇప్పుడు సడెన్‌గా వచ్చి దిల్ రాజు బుక్ చేసుకున్నాడు. దిల్ రాజు చేయి వేస్తే మిగిలిన సినిమాలన్నీ తప్పుకోవాల్సిందే అన్నట్టుగా మారింది. అసలే ఇప్పుడు సంక్రాంతి బరిలో థియేటర్ల ఇష్యూ నడుస్తోంది. మధ్యలో ఇప్పుడు సమంత శాకుంతలం మూవీ హాట్ టాపిక్ అవుతోంది.

విశ్వక్ సేన్ ధమ్కీ, ధనుష్ సర్, కిరణ్‌ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ అనే చిత్రాలు ఆల్రెడీ ఫిబ్రవరి 17ని బుక్ చేసుకున్నాయి. వాటికి సంబంధించిన ప్రకటనలు ఎప్పుడో జరిగాయి. అయితే ఇప్పుడు తాపీగా వచ్చిన దిల్ రాజు.. ఆ సినిమాలను ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. నిర్మాతలం అంతా కూడా కలిసి మాట్లాడుకుంటామని, క్లాషెస్ రాకుండా సినిమాల డేట్లను అడ్జస్ట్ చేసుకుంటామని చెబుతుంటారు.

కానీ చేతల్లో మాత్రం ఇలా ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు దిల్ రాజు పంతానికి పోయి ఆ డేట్‌ను పట్టుకున్నాడా? లేదా? అనుకోకుండానే ఆ డేట్‌ను లాక్ చేసుకున్నాడా? అన్నది తెలియడం లేదు. కానీ దిల్ రాజు ఎంట్రీ ఇస్తే థియేటర్ల సమస్య మాత్రం మిగతా సినిమాలకు ఎదురుకాక తప్పదనిపిస్తోంది.

ఇప్పుడు వారసుడు, తెగింపు చిత్రాలను కూడా సంక్రాంతి బరిలో దిల్ రాజు భారీ స్థాయిలో దింపుతున్నట్టుగా తెలుస్తోంది. మైత్రికి షాక్ ఇచ్చే క్రమంలోనే దిల్ రాజు తన ప్లాన్స్ మార్చుకున్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి బరిలో దిల్ రాజు సినిమాలు ఎలా కలెక్షన్లను రాబడుతుందో చూడాలి.

Also Read: Kalyaan Dhev New Year Post : ఈ ఏడాదిలో ఎన్నో నేర్చుకున్నా.. కళ్యాణ్‌ దేవ్ ఎమోషనల్ పోస్ట్

Also Read: Heroine Poorna Pregnant : తల్లి కాబోతోన్న హీరోయిన్ పూర్ణ.. అందుకే వాటికి దూరమైందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News