ఎయిర్ ఇండియా అధికారులు, న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్ క్రూ సిబ్బందిపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా నోటీసులు జారీ చేసింది. మహిళపై మూత్రం పోసిన ఘటనపై నిర్లక్ష్యం వహించినందుకు చర్యలు ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది.
గత ఏడాది అంటే 2022 నవంబర్ 26వ తేదీన న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలోని బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో ఓ వ్యక్తి తోటి మహిళా ప్రయాణీకురాలిపై మూత్రం పోశాడు. ఆ మహిళ వయస్సు 70 ఏళ్ల కంటే ఎక్కువే. ఈ ఘటనపై ఎయిర్ ఇండియా ఇప్పటి వరకూ చర్యలు తీసుకోలేదు. కనీసం ఈ ఘటనను సీరియస్‌గా తీసుకోలేదని తెలుస్తోంది. దాంతో డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘటనను తేలిగ్గా తీసుకోవడంపై విమాన సిబ్బంది, ఎయిర్ ఇండియా అధికారులపై చర్యలు ఎందుకు తీసుకోకూడదంటూ నోటీసులు పంపించింది.
జనవరి 4వ తేదీన ఈ ఘటన గురించి తమ దృష్టికి వచ్చిన తరువాత ఎయిర్ ఇండియాను వివరణ కోరింది డీజీసీఏ. ఎయిర్ ఇండియా సమర్పించిన వివరణ ప్రకారం..విమానంలో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని ఎదుర్కొనేందుకు విమాన సిబ్బంది తగిన చర్యలు తీసుకోలేదని తెలుస్తోందని డీజీసీఏ తెలిపింది. ఎయిర్ ఇండియా వైఖరి ఈ విషయంలో నాన్ ప్రొఫెషనల్‌గా ఉందని తేల్చింది.
చర్యలు ఎందుకు తీసుకోకూడదు
ఈ ఘటనను దృష్టిలో ఉంచుకుని ఎయిర్ ఇండియా అధికారులు, విమాన క్రూ సిబ్బంది అందరిపై సమాధానం కోరుతూ నోటీసులు జారీ చేసింది డీజీసీఏ. విధుల నిర్లక్ష్యంపై వారిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలని ప్రశ్నించింది. సమాధానం ఇచ్చేందుకు రెండు వారాల గడువిచ్చింది. ఆ సమాధానం ఆధారంగా తదుపరి చర్యలుంటాయి.
ప్రయాణీకురాలిపై మూత్రం పోసిన మరో ఘటన
ఎయిర్ ఇండియా విమానంలో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన మరో కేసు ఇది. ఈ ఘటన పారిస్ నుంచి న్యూ ఢిల్లీకు వస్తున్న విమానంలో జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి తోటి మహిళ కప్పుకున్న రగ్గుపై మూత్రం పోశాడు. నవంబర్ 26, 2022న న్యూయార్క్-ఢిల్లీ విమానంలో మూత్రం పోసిన ఘటన జరిగిన సరిగ్గా పది రోజులకు ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడు క్షమాపణలు చెప్పడంతో అతనిపై ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
ఈ విషయంపై గురువారం నాడు అధికారులు సమాచారమిచ్చారు. ఈ ఘటన డిసెంబర్ 6, 2022న ఎయిర్ ఇండియా విమానం 142లో జరిగింది. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ఏటీసీకు పైలట్ ఈ విషయాన్ని చేరవేశాడు. ఆ తరువాత ఆ ప్రయాణీకుడిని అదుపులో తీసుకున్నారు.
Also read: Earthquake News: ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్‌లో భూకంపం.. ఢిల్లీలోనూ కంపించిన భూమి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook