Adivi Sesh : ఒక్కో ఫ్యామిలీలో పది మంది హీరోలు.. మా వరకు కథలు రావు.. అడివి శేష్ కామెంట్స్

Nepotism Heroes in South Industry సినిమా పరిశ్రమలోనే కాదు ఎక్కడైనా వారసత్వం ఉంటుంది. కాకపోతే అందరి దృష్టి సినిమాల మీద ఉంటుంది. వారసత్వం వల్ల వచ్చిన హీరోలంతా సక్సెస్ అవ్వలేదని అందరికీ తెలిసిందే. కానీ అందరూ వారసత్వం మీద కామెంట్లు చేస్తుంటారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 7, 2023, 05:00 PM IST
  • హిట్ 2తో హిట్ కొట్టేసిన అడివి శేష్
  • వారసత్వ హీరోలపై అడివి శేష్
  • ఒక్కో ఫ్యామిలీలో పది మంది హీరోలట
Adivi Sesh : ఒక్కో ఫ్యామిలీలో పది మంది హీరోలు.. మా వరకు కథలు రావు.. అడివి శేష్ కామెంట్స్

Nepotism Heroes in South Industry మన తెలుగు పరిశ్రమలో మెగా, నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని ఫ్యామిలీలకు ఉన్న చరిత్ర అందరికీ తెలిసిందే. దాదాపు ఈ ఫ్యామిలీల్లోంచే టాప్ హీరోలంతా ఉన్నారు. కొత్త హీరోలు, యంగ్ హీరోలు కూడా చాలా మందే ఉన్నారు. స్టార్ స్టేటస్‌ తెచ్చుకోవడం ఓ పెద్ద సాహసం అయితే.. దాన్ని కాపాడుకోవడం చేసే ప్రయాసలో ఇంకో ఎత్తు. అయితే అడివి శేష్ మాత్రం ఇప్పుడు స్టార్ హీరోగా మారిపోయాడు.

ఆయన చేసే సినిమాలు, ఎంచుకునే కథలు ఎప్పుడూ డిఫరెంట్‌గా ఉంటాయి. తన సినిమాలకు కథలు కూడా రాసుకుంటాడు. అలా హీరోగా, రైటర్‌గా అడివి శేష్ ఫుల్ బిజీగా ఉంటాడు. అయితే అడివి శేష్ స్టార్ హీరోలందరితోనూ బాగానే ఉంటాడు. ఇప్పుడు అడివి శేష్ అందరికీ కావాల్సిన వాడే. మహేష్‌ బాబుతో సినిమాలు చేస్తున్నాడు. అక్కినేని వారికి సినిమాలు చేస్తున్నాడు. ఇటు మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్స్ ఉన్నాయి. నాని వంటి హీరోలతోనూ సాన్నిహిత్యం ఉంది.

ఇలాంటి అడివి శేష్ తాజాగా వారసత్వ హీరోల గురించి కామెంట్ చేశాడట. ఒక్కో ఫ్యామిలీలో పది మంది హీరోలున్నారని, వారసత్వ హీరోలు కాకపోతే. మంచి స్క్రిప్ట్ మన వరకు రావడం చాలా కష్టం.. మనం వాళ్లకి 53వ ఆప్షన్‌గా ఉంటామని, కానీ అక్కడ కేవలం ఇరవై మాత్రమే మంచి స్క్రిప్ట్స్ ఉంటాయని అడివి శేష్ అన్నాడట.

ప్రస్తుతం ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అడివి శేష్ HIT 2 సినిమా ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీ ఆడియెన్స్‌ను సైతం అడివి శేష్ ఆకట్టుకున్నాడు. ఇక అడివి శేష్ తదుపరి చిత్రాల అప్డేట్లు రావాల్సి ఉంది. అయితే అడివి శేష్ మళ్లీ ఈ హిట్ యూనివర్స్‌లో సందడి చేసేందుకు మాత్రం సిద్దంగానే ఉన్నాడు. మూడో పార్టులోనూ అడివి శేష్ కనిపిస్తాడని తెలుస్తోంది.

Also Read: Thala Ajith Family : అజిత్ ఫ్యామిలీ ఫోటోలు.. ఆయన కూతురు ఎలా ఉందో చూశారా?

Also Read: Roja Satires on Mega Family : ఏ ఒక్కరికీ సాయం చేయలేదట.. అందుకే ముగ్గుర్నీ ఓడించారట.. మంత్రి రోజా సంచలన కామెంట్స్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News