Perni nani Comments on Pawan Kalyan: పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి నాని తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. పవన్ యువశక్తి సభలో అధికార పార్టీని టార్గెట్ చేయగా దానికి కౌంటర్ గా పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర యువతకు స్ఫూర్తి నింపుతానని నెల రోజుల నుంచి చెబుతూ వచ్చారు కానీ ఇప్పుడు ఆయన ప్రసంగం అంతా ఆత్మస్తుతి పరనింద అన్నట్లుగా సాగిందని అన్నారు పేర్ని నాని. మహనీయులు విమర్శిస్తే తట్టుకుంటాడట కానీ మనలాంటి వాళ్ళం విమర్శిస్తే తట్టుకోడట ఆయన ఏమిటో మీరే అర్థం చేసుకోవాలంటూ పేర్ని నాని పేర్కొన్నారు.
సినిమా భాష మాత్రమే తెలిసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని పేర్కొన్న నాని పవన్ కళ్యాణ్ ఒక కుసంస్కారి, దిగజారిన వ్యక్తి అని అన్నారు. మూడు నాలుగు వేలమంది ఉన్నారని నోటికి వచ్చినట్లు మాట్లాడాడని రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను కు సంస్కారంతో మాట్లాడడం తప్ప ఆ సభలో ఇంకేమైనా ఉందా అని ప్రశ్నించారు. అతనిని నమ్మి అంతమంది వెళితే మిమ్మల్ని నేను నమ్మను అంటున్నాడు నట్టేట ముంచేస్తారు అనడం దగా కాదా అని పవన్ కళ్యాణ్ ను పేర్ని నాని ప్రశ్నించారు.
జగన్ అంటే పవన్ కళ్యాణ్ కు ద్వేషం, అసూయ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అయితే ఒక్క విషయం మాత్రం పవన్ కళ్యాణ్ నిజం చెప్పాడని ఒంటరిగా వెళ్లి మళ్ళీ కుక్క చావు చావలేనని అన్నాడని రెండోసారి జగన్ చేతిలో కుక్క చావు చావలేను అందుకే చంద్రబాబుతో కలుస్తున్నా అనే విషయం చెప్పడానికి ఈ సమావేశం అని అన్నారు. చంద్రబాబు అత్తతోనో మామతోనో అల్లుడికి ఉన్న సంబంధం అన్నాడు, జగన్ అదే చెబుతుంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నాడు అని ఆయన ప్రశ్నించారు. గిడుగు రామ్మూర్తి, గురజాడ వంటి వారు కూడా భార్య ఉండి బయట మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్లను తిరుగుబోతున్నారు మరి ఈ తిరుగుబోతుకి ఫ్లెక్సీలు కట్టాలంటూ పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించారు.
అక్రమ, తప్పుడు కేసుల్లో ఇరుక్కుని పోరాటం చేసి ప్రజల్లో నిలబడిన వ్యక్తి జగన్ అని అలాంటి వ్యక్తికి సెల్యూట్ చేయడం సంస్కారం అని అన్నారు. ఇక ఒక మాజీ నటి, కళాకారిణి, మహిళ రోజా పట్ల ఇంతకు కు సంస్కారంగా ఎలా మాట్లాడావని ఆయన పవన్ ను ప్రశ్నించారు. మీ ఇంట్లో ఆడవాళ్లు నటించడం లేదా? నీ వయసు ఎంత? నీ పక్కన నటిస్తున్న మహిళల వయసెంత? నువ్వు మా వాడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది రోజా దమ్ముగా పోరాడి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచింది, ఇవాళ రాష్ట్ర మంత్రిగా పనిచేస్తుంది నువ్వేం పొడిచావు? ముందు మహిళలకు మర్యాద ఇవ్వడం నేర్చుకో అంటూ ఆయన పేర్కొన్నారు.
Also Read: KL Rahul Wedding: హీరోయిన్ ను పెళ్లాడబోతున్న రాహుల్.. పెళ్లి అతిధుల లిస్టు ఇదే!
Also Read: AP High Court Shock: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్.. జీవో నెం.1పై స్టే విధింపు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook