AP High Court Shock to govt on GO Number 1: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు కందుకూరు రోడ్ షో, ఆ తర్వాత గుంటూరులో సభలో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ వన్ అనేదాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఇది బ్రిటిష్ కాలం నాటి చట్టం అని చెబుతూ ప్రతిపక్షాలు ఈ విషయం మీద పెద్ద ఎత్తున మండిపడ్డాయి. ఇదే అంశం మీద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు.
దీంతో దీనిని విచారించిన హైకోర్టు 23వ తేదీ వరకు జీవో నెంబర్ వన్ సస్పెండ్ చేస్తున్నట్లు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ వన్ ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ మీద విచారణ చేపట్టిన హైకోర్టు ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ఈ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ వన్ నిబంధనలకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడిన కోర్టు ఈనెల 20వ తేదీలోగా కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు దారి జారీ చేయడమే కాక తదుపరి విచారణను ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ లో రోడ్ షోలు, ర్యాలీలు సభలపై ఆంక్షలు విధిస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్ వన్ మీద పెద్ద ఎత్తున దుమారం కొనసాగుతోంది. ప్రతిపక్షాల గొంతు నొక్కెందుకే ప్రభుత్వం ఇలాంటి చీకటి జీవోలను తీసుకొస్తోందని ప్రభుత్వం మీద విపక్షాల తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నాయి.
బ్రిటిష్ కాలం నాటి చట్టాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు ప్రభుత్వం మీద మండిపడుతున్నాయి. అయితే ఒక రకంగా ప్రభుత్వానికి ఇది షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ప్రతిపక్ష నేతలను, విపక్ష నేతలను కట్టడి చేసేందుకు తీసుకొచ్చినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వం ఈ విషయం మీద ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి మరి.
Also Read: Buddha Venkanna Counter : వర్మకు విషయం లేదా.. బుద్దా వెంకన్న అంత మాట అనేశాడు ఏంటి?
Also Read: Veera Simha Reddy :ఊహించని షాక్.. విడుదలైన గంటల వ్యవధిలోనే హెచ్డీ ప్రింట్ లీక్?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook