Netflix Upcoming Telugu Movies: భోళా శంకర్ టు SSMB 28.. నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు చూశారా?

Netflix Upcoming Telugu Movies:  నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఎక్కువగా ప్రాంతీయ భాషల మీద దృష్టి పెట్టి తాము రిలీజ్ చేయబోయే తెలుగు సినిమాల లిస్టు రిలీజ్ చేసింది. ఆ వివరాలు   

Written by - Chaganti Bhargav | Last Updated : Jan 14, 2023, 09:07 PM IST
Netflix Upcoming Telugu Movies: భోళా శంకర్ టు SSMB 28.. నెట్ ఫ్లిక్స్ సినిమాల లిస్టు చూశారా?

Netflix announces thier Upcoming Telugu Movies: ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు ఎక్కువగా ప్రాంతీయ భాషల మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రాంతీయ ఓటీటీలతో సమానంగా తెలుగు సినిమా హక్కులు కొనుగోలు చేస్తున్న ఈ సంస్థ భోగి పండుగ సందర్భంగా త్వరలో తమ నెట్ఫ్లిక్స్ నుంచి రిలీజ్ కాబోతున్న తెలుగు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ వరుసగా విడుదల చేసింది. ముందుగా సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న బడ్డి అనే సినిమా నెట్ఫిక్స్ లో రాబోతోందని కేవలం తెలుగు మాత్రమే కాదు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా ఈ సినిమా నెట్ఫిక్స్ లో థియేటర్ రిలీజ్ తర్వాత అందుబాటులో ఉంటుందని ప్రకటించింది.

ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమా కూడా విడుదల కాబోతోందని తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుందని ప్రకటించింది. ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కుతున్న  అమిగోస్ సినిమా కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో రిలీజ్ కాబోతుందని ప్రకటించింది. అదేవిధంగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న బుట్ట బొమ్మ సినిమా కూడా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుంది అని ప్రకటించింది.

అలాగే నాని కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న దసరా సినిమా కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ కాబోతుందని ప్రకటించింది. అదేవిధంగా ధమాకా కూడా త్వరలోనే నెట్ఫిక్స్ లో అందుబాటులోకి రాబోతుందని ప్రకటించింది. కార్తికేయ హీరోగా నటిస్తున్న ఎనిమిదవ సినిమా, మీటర్ అనే తెలుగు సినిమా కూడా నెట్ఫిక్స్ లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించడమే గాక 18 పేజెస్ సినిమా కూడా త్వరలోనే నెట్ ఫిక్స్ లో విడుదల కాబోతున్నట్టు ప్రకటించింది. అంతేకాకుండా నాగశౌర్య హీరోగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ప్రొడక్షన్ నెంబర్ సిక్స్ గా నటిస్తున్న సినిమా కూడా నెట్ఫిక్స్ లో విడుదల కాబోతున్నట్లు ప్రకటించింది.

అలాగే అనుష్క హీరోయిన్ గా నవీన్ పోలిశెట్టి హీరోగాతెరకెక్కుతున్న సినిమా కూడా నెట్ఫిక్స్ లో రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటించింది. అలాగే పంజా వైష్ణవ్ తేజ్ నాలుగో సినిమా కూడా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతుందని ప్రకటించింది. ఇక టిల్లు స్క్వేర్ కూడా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ అవుతుందని, వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న 12వ సినిమా కూడా  నెట్ఫిక్స్ లో రిలీజ్ అవుతుంది అని ప్రకటించింది.

అలాగే సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న విరూపాక్ష నెట్ఫిక్స్ లో విడుదల కాబోతుందని ప్రకటించడమే కాదు మహేష్ బాబు 28వ సినిమా కూడా తమ నెట్ఫిక్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు  ప్రకటించింది. ఈ సినిమాని కూడా తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దియేట్రికల్ రిలీజ్ అయిన కొన్నాళ్లకు రిలీజ్ చేస్తామని ప్రకటించింది. అయితే తమ ఓటీటీలో రిలీజ్ కాబోతున్న సినిమాల గురించి ఓటీటీ ప్రకటించడం ఇదే తొలిసారి. నెట్ ఫ్లిక్స్ మార్కెటింగ్ స్టేటజీ భలే ఉందే అంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Balakrishna Opens up: వీర సింహా రెడ్డిలో అందుకే ఆ డైలాగులు.. అసలు విషయం బయటపెట్టిన బాలకృష్ణ!

Also Read: Body chopped: ఢిల్లీలో 3 ముక్కలుగా నరికిన మృతదేహం లభ్యం.. టెర్రరిస్టు లింకుల కలకలం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News