Planet Transit 2023: ఫిబ్రవరి నెలలో గ్రహాల గోచారం.. ఈ 4 రాశుల వారికి మంచి రోజులు మెుదలు..

February Planet Transit: ఫిబ్రవరిలో 4 గ్రహాలు రాశిని మార్చబోతున్నాయి. దీని వల్ల 4 రాశుల వారికి మంచి రోజులు ప్రారంభంకానున్నాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 28, 2023, 03:10 PM IST
Planet Transit 2023: ఫిబ్రవరి నెలలో గ్రహాల గోచారం.. ఈ 4 రాశుల వారికి మంచి రోజులు మెుదలు..

Planet transits in February 2023: గ్రహాల సంచారం పరంగా ఫిబ్రవరి నెల చాలా ముఖ్యమైనది. ఎందుంకంటే వచ్చే నెలలో నాలుగు గ్రహాలు తమ రాశిని మార్చబోతున్నాయి. ఈ జాబితాలో సూర్యుడు, బుధుడు, శుక్రుడితోపాటు నెప్ట్యూన్ కూడా ఉన్నారు. మెుదట ఫిబ్రవరి 07న బుధుడు, ఆపై సూర్యభగవానుడు 13న, తర్వాత శుక్రుడు ఫిబ్రవరి 15న, చివరగా ఫిబ్రవరి 18న నెప్ట్యూన్ తమ రాశులను ఛేంజ్ చేయనున్నాయి. ఈ గ్రహాల రాశి మార్పు నాలుగు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

గ్రహాల సంచారం ఈ రాశులకు వరం
మేష రాశిచక్రం (Aries)
4 గ్రహాల రాశి మార్పు మేషరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులు భారీగా లాభాలను గడిస్తారు. ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు పాత పెట్టుబడుల నుండి లాభాలను పొందుతారు. అయితే ఈ సమయంలో మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఏదో ఒక విషయంలో మీరు టెన్షన్ కు గురయ్యే అవకాశం ఉంది. 
కన్య రాశిచక్రం (Virgo)
ఫిబ్రవరి నెల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది.  ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ ను కుదుర్చుకునే అవకాశం ఉంది. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం లేదా మతపరమైన కార్యక్రమం జరిగే అవకాశం ఉంది.

తులా రాశిచక్రం (Libra)
ఫిబ్రవరి నెల తుల రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థుల కోరికలు నెరవేరుతాయి. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మీరు మీ ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లే అవకాశం ఉంది. 
ధనుస్సు రాశిచక్రం (Sagittarius)
ఫిబ్రవరి నెలలో నాలుగు గ్రహాల రాశి మార్పు ధనుస్సు రాశి వారికి మేలు చేస్తుంది. ఎందుకంటే జనవరి 17 నుండి మీకు శని సడే సతి నుండి విముక్తి లభించింది. ఉద్యోగులు డబ్బును ఆదా చేస్తారు. నిరుద్యోగులక ఉద్యోగులకు లభిస్తుంది. మీరు కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. 

Also Read: Guru Rahu Yuti 2023: అరుదైన యోగాన్ని చేస్తున్న రాహు-గురు.. వీరి జీవితాల్లో గందరగోళం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

 

Trending News