Suryakumar Yadav achieves 2nd highest T20I batting rating, Eye on Dawid Malan Record: టీ20 ఫార్మాట్‌లో భారత స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ హవా కొనసాగుతోంది. బుధవారం (ఫిబ్రవరి 1) విడుదల అయిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌లో సూర్య అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ ఖాతాలో ప్రస్తుతం 908 రేటింగ్ పాయింట్స్ ఉన్నాయి. దాంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఆల్‌టైమ్ రెండో అత్యధిక రేటింగ్ పాయింట్లను సాధించాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ డేవిడ్ మలన్ అరుదైన రికార్డుపై సూర్య కన్నేశాడు.
ప్రస్తుతం భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. రాంచిలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 34 బంతుల్లో 47 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. 910 రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. లక్నోలో జరిగిన రెండో టీ20లో 31 బంతుల్లో 26 పరుగులు చేయడంతో రెండు పాయింట్లు కోల్పోయి 908 రేటింగ్ పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. 908 రేటింగ్ పాయింట్లతో ఆల్‌టైమ్ రెండో అత్యధిక రేటింగ్ పాయింట్లను సూర్య సాధించాడు.
మూడో టీ20లో మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపిస్తే.. టీ20 ర్యాంకింగ్స్‌లో కెరీర్ బెస్ట్ రేటింగ్ పాయింట్స్ అందుకునే అవకాశం ఉంది. 2020లో ఇంగ్లండ్ డేంజరస్ బ్యాటర్ డేవిడ్ మలన్ 915 పాయింట్లతో టీ20 ర్యాంకింగ్స్‌లో ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు. సూర్యకుమార్ గత సంవత్సరం టీ20 ప్రపంచకప్‌లో ఆరు మ్యాచ్‌లు ఆడి 239 పరుగులు చేసి అగ్ర ర్యాంకింగ్‌ను అందుకున్నాడు. ఐసీసీ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా కూడా సూర్య ఎంపికయ్యాడు.
బ్యాటర్లు లేదా బౌలర్ల జాబితాలో టాప్ 10లో సూర్యకుమార్ యాదవ్ తప్ప మరే ఇతర భారత బ్యాటర్ లేడు. ఆల్ రౌండర్లలో హార్దిక్ పాండ్యా మూడవ స్థానంలో నిలిచాడు. ఇక భారత ఆటగాడు మహ్మద్ సిరాజ్ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
బ్యాటర్ల జాబితాలో శుభ్‌మన్ గిల్ (6), విరాట్ కోహ్లీ (7), రోహిత్ శర్మ (9) స్థానాల్లో ఉన్నారు. న్యూజిలాండ్ ఓపెనర్ ఫిన్ అలన్ టీ20 బ్యాటర్‌ల జాబితాలో ఎనిమిది స్థానాలు ఎగబాకి.. 19వ స్థానానికి చేరుకున్నాడు. తొలి మ్యాచ్‌లో అజేయ అర్ధ సెంచరీతో చెలరేగిన డారిల్ మిచెల్ తొమ్మిది స్థానాలు మెరుగుపడి.. 29వ స్థానానికి చేరుకున్నాడు.
Also Read: Steve Smith: బీసీసీఐ మోసం చేసింది.. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడను! స్టీవ్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.