Mahindra New Electric Cars: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎలక్ట్రిక్‌ కార్లు.. కూపే లాంటి డిజైన్‌తో సరికొత్తగా!

Mahindra to debut XUV 700 EV in India Soon. మహీంద్రా కంపెనీ తన 5 భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లను యూకేలో ఆగస్టు 2022లో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో పరిచయం చేస్తోంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 5, 2023, 03:03 PM IST
  • మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎలక్ట్రిక్‌ కార్లు
  • కూపే లాంటి డిజైన్‌తో సరికొత్తగా
  • ఫిబ్రవరి 10న మహీంద్రా ఈవెంట్‌
Mahindra New Electric Cars: మార్కెట్లోకి మహీంద్రా ఎక్స్‌యూవీ 700 ఎలక్ట్రిక్‌ కార్లు.. కూపే లాంటి డిజైన్‌తో సరికొత్తగా!

Mahindra to Launch Five New Electric Cars in India: మహీంద్రా కంపెనీ ఇటీవలే భారత మార్కెట్లో తన మొదటి ఎలక్ట్రిక్ ఎక్స్‌యూవీ 400ని విడుదల చేసింది. ఈ కారు బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభం కాగా.. మొదటి 5 రోజుల్లోనే 10 వేల బుకింగ్‌లు వచ్చాయి. మహీంద్రా అక్కడితో ఆగకుండా.. తన 'ఎక్స్‌యూవీ 700' ఎస్‌యూవీ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. మహీంద్రా కంపెనీ తన 5 భవిష్యత్ ఎలక్ట్రిక్ కార్లను యూకేలో ఆగస్టు 2022లో పరిచయం చేసింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కార్లను భారతదేశంలో పరిచయం చేస్తున్నారు. 2023 ఫిబ్రవరి 10న మహీంద్రా ఓ ఈవెంట్‌ను నిర్వహించి ఎలక్ట్రిక్ కార్లను ప్రదర్శించనుంది. 

మహీంద్రా యొక్క రాబోయే ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు విభిన్న బ్రాండ్‌లుగా విభజించబడింది. XUV.e మరియు BE. XUV.e క్రింద రెండు మోడల్‌లు ఉన్నాయి. అయితే BEలో మళ్లీ మూడు మోడల్‌లు ఉన్నాయి. XUV.e శ్రేణి ముందుగా మార్కెట్లోకి రానుంది. డిసెంబర్ 2024 నుంచి ఈ కార్లు అందుబాటులోకి రానున్నాయి. అన్నారం BE మోడల్ అక్టోబర్ 2025 నుంచి మార్కెట్లోకి వస్తాయి. 

మహీంద్రా ఇప్పటికే తన ఎక్స్‌యూవీ శ్రేణిని పెట్రోల్/డీజిల్ ఇంజిన్‌లతో విక్రయిస్తోంది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 చాలా ప్రజాదరణ పొందిన కారు. ఇప్పుడు ఎలక్ట్రిక్ విభాగంలో కూడా సరికొత్త గుర్తింపును పొందబోతోంది. XUV700 యొక్క ఎలక్ట్రిక్ మోడల్‌లుగా  చెప్పబడుతున్న XUV.e8ని ఐదు EVలలో మహీంద్రా భారతదేశంలో మొదటిసారిగా పరిచయం చేస్తుంది. అయితే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఇవి XUV700 యొక్క పూర్తి ఎలక్ట్రిక్ వెర్షన్ కాదు. దీని డిజైన్ మాత్రమే XUV700ని పోలి ఉంటుంది. 

XUV.e8 తర్వాత మహీంద్రా కంపెనీ XUV.e9ని తీసుకురానుంది. ఇది కూపే లాంటి డిజైన్‌తో సరికొత్తగా రానుంది. ఈ మోడల్ ఏప్రిల్ 2025లో ఉత్పత్తిలోకి వస్తుంది. మహీంద్రా యొక్క XUV400 ఎలక్ట్రిక్ కారు ఇప్పటికే టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారుకు గట్టి పోటీ ఇస్తోంది. అదే సమయంలో టాటా సఫారీ యొక్క ఎలక్ట్రిక్ మోడల్‌ను కూడా త్వరలో భారత మార్కెట్లోకి తీసుకురాబోతోంది. ఇది మహీంద్రా యొక్క XUV.e8 తో పోటీపడుతుంది.

Also Read: Sidhika Sharma Pics: బెడ్‌పై హాట్ పోజులిచ్చిన సిద్ధికా శర్మ.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న పిక్స్!

Also Read: Adah Sharma Hot Pics: షార్ట్ డ్రెస్‌లో ఆదా శర్మ.. వంగి మరీ అందాలన్నీ ఆరబోసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x