నిజమైన ప్రేమ కోసం కొందరు ఏమైనా చేస్తారు. ఈ ప్రేమను పొందేందుకు చాలామంది చాలారకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా..సమస్యలు వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో నిజమైన ప్రేమ పొందేందుకు జ్యోతిష్య పండితులు కొన్ని సూచనలు పాటిస్తుంటారు...
కొంతమంది ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నా నిజమైన ప్రేమను పొందలేరు. ఫిబ్రవరి 14 ప్రపంచ ప్రేమికుల దినోత్సవం ఉంది. వ్యాలెంటైన్స్ డే సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ప్రేమను చాటుకునే ప్రయత్నం చేస్తుంటారు. ప్రేమను పొందాలనుకుంటారు. అయితే జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు బలహీనంగా ఉంటే ఆ ప్రేమ పొందలేరు. ప్రేమను పొందే క్రమంలో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ప్రేమ పొందాలంటే..శుక్రుడు కారకుడు. అందుకే కుండలిలో శుక్రుడు పటిష్టంగా ఉండాలి. శుక్రుడు పటిష్టంగా ఉంటే..ప్రేమ పొందడంలో ఏ విధమైన కష్టాలు ఎదురుకావు.
మరి కొద్దిరోజుల్లో వ్యాలెంటైన్స్ వీక్ ప్రారంభం కానుంది. వ్యాలెంటైన్ వీక్ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానుంది. నిజమైన ప్రేమను పొందేందుకు జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని ఉపాయాలున్నాయి. అవి పాటించాలంటున్నారు జ్యోతిష్యులు. ఇవి పాటిస్తే శుక్రుడు పటిష్టంగా ఉంటాడు. జ్యోతిష్యం ప్రకారం ఈ ఉపాయాలు ఆచరిస్తే స్వచ్ఛమైన ప్రేమ పొందవచ్చు. వ్యాలెంటైన్ వీక్‌లో ఈ ఉపాయాల వల్ల కుటుంబంలో ప్రేమ పెరగడం, సోదర సోదరీమణుల మధ్య పరస్పరం ప్రేమ, భార్యాభర్తల మధ్య బంధం పటిష్టం కావడం ఇలా సానుకూల పరిణామాలుంటాయి.
కుండలిలో శుక్రుడిని పటిష్టం చేసేందుకు ఏం చేయాలి
శుక్రుడిని పటిష్టం చేసేందుకు శుక్రవారం నాడు తెల్లబట్టలు ధరించి ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమహ మంత్రాన్ని 108 సార్లు జపించాలి.
శుక్ర గ్రహానికి బలాన్ని అందించేందుకు శుక్రవారం నాడు పంచదార, బియ్యం, పాలు-పెరుగు లేదా నెయ్యితో చేసే ఆహార పదార్ధాలు తీసుకోవాలి.
శాస్త్రాల ప్రకారం దానాలు చేయడం కూడా అత్యంత మహత్యం ఉంటుంది. శుక్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు, కుండలిలో శుక్రుడిని బలోపేతం చేసేందుకు తెల్లటి బట్టలు, బియ్యం, నెయ్యి, పంచదార, పటికబెల్లం, పెరుగు దానమివ్వాలి.
జ్యోతిష్యం ప్రకారం శుక్రుడిని ప్రసన్నం చేసుకునేందుకు శుక్రవారం నాడు శివుడికి తెల్ల బట్టలు అర్పించాలి. మహాదేవుడిని పూజించాలి.
Also read: Budh Gochar 2023: రేపట్నించి ఆ 5 రాశుల జీవితంలో అన్నీ కష్టాలే, సర్వం కోల్పోతారు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook