ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 2 స్థానాలు కలిపి మొత్తం 16 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మరోవైపు ఎన్నికల కోడ్ సైతం అమల్లోకి వచ్చింది.
ఏపీలో మొత్తం 9 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. తెలంగాణలో 1 టీచర్, 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల జరగాల్సి ఉంది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్..నిన్న అంటే ఫిబ్రవరి 9వ తేదీన విడుదలైంది. ఫిబ్రవరి 16వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. ఫిబ్రవరి 23 వరకూ నామినేషన్లు స్వీకరించనున్నారు.
ఫిబ్రవరి 27వ తేదీన నామినేషన్లు ఉపసంహరణ ఉంటుంది. మొత్తం 16 స్థానాలకు మార్చ్ 13న ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 4 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. మార్చ్ 16వ తేదీన ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటిస్తారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే ఈ నియోజకవర్గాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని ఎన్నికల కమీషన్ స్పష్టం చేసింది. ఏపీలోని స్థానిక సంస్థల్లో అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 స్థానాలు, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానాలున్నాయి. ఇక టీచర్ ఎమ్మెల్సీలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉన్నాయి. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఉన్నాయి.
ఇక తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ టీచర్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలున్నాయి.
Also read: Indigo Airlines: ఇండిగో ఎయిర్‌లైన్స్ పొరపాటు.. 37 మంది ప్రయాణికుల లగేజీ మిస్సింగ్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook