Ravindra Jadeja Fined: నాగ్‌పూర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో ఐసీసీ ప్రవర్తనా నియమావళి లెవల్ 1ని ఉల్లంఘించినందుకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాకు జరిమానా పడింది. మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించింది ఐసీసీ. ఐసీసీ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.20ని ఉల్లంఘించినందుకు ఫైన్ విధిస్తున్నట్లు ఐసీసీ తెలిపింది. ఫీల్డ్ అంపైర్ల పర్మిషన్ తీసుకోకుండా జడేజా తన వేలి వాపు తగ్గేందుకు క్రీమ్ రాసుకుని రూల్స్ బ్రేక్ చేశాడని పేర్కొంది. జడేజా తన తప్పును అంగీకరించడంతో విచారణ అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ మ్యాచ్ తొలిరోజు రవీంద్ర జడేజా బంతితో అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే ఆసీస్ ఇన్నింగ్స్ 46వ ఓవర్ సందర్భంగా జడేజా తన వేలికి క్రీమ్ రాసుకోవడం కనిపించింది. మహ్మద్ సిరాజ్ అరచేతి నుంచి కొంత క్రీమ్ తీసుకుని తన వేలికి రాసుకున్నాడు. తీసి అతని ఎడమ చేతి చూపుడు వేలికి రుద్దడం కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. జడేజా ట్యాంపరింగ్‌కు పాల్పడ్డాడంటూ ఆరోపణలు కూడా వచ్చాయి. ఆన్ ఫీల్డ్ అంపైర్ల నుంచి అనుమతి తీసుకోకుండా జడేజా ఇలా చేశాడు. దీంతో ఐసీసీ జరిమానా విధించింది.
ఈ ఘటన తర్వాత భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) అధికారి ఒకరు ఈ విషయంపై అప్‌డేట్ ఇచ్చారు. వేలు నొప్పి నుంచి ఉపశమనం కలిగించే పెయిన్ రిలీఫ్ క్రీమ్ అని స్పష్టంచేశారు. జడేజా నేరాన్ని అంగీకరించగా.. ఐసీసీ విధించిన ఫైన్‌ను చెల్లించడానికి అంగీకరించాడు. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పడింది. జడేజాకు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతతో పాటు అతని ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ని విధించింది. జడేజా ఫీల్డ్ అంపైర్ల నుంచి పర్మిషన్ తీసుకుని ఉంటే.. ఎలాంటి వివాదం ఉండేది కాదు.
Cricketer Ravindra Jadeja has been fined 25 per cent of his match fee and one demerit point added to Jadeja’s disciplinary record. Incident occurred during 46th over of Australia’s first innings on Feb 9. @ICC @BCCI #INDvAUS #RavindraJadeja #BGT2023 pic.twitter.com/3zGdbBeguY
— Sunil Kumar (@Sunilkumar6975) February 11, 2023
గాయం కారణంగా చాలా కాలంగా జట్టుకు దూరంగా ఉన్న జడేజా.. ఈ మ్యాచ్ ద్వారా రీఎంట్రీ ఇచ్చి అదరగొట్టాడు. మొదట బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఆసీస్ బ్యాట్స్‌మెన్ భరతం పట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా 70 పరుగులు చేశాడు. టీమిండియాకు భారీ ఆధిక్యం దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు తీశాడు. దీంతో జడేజాకే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
Also Read: IND vs AUS 1st Test Highlights: కోహ్లీని దాటేసిన షమీ.. సిక్సర్లతో స్టేడియంలో హోరు
Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Ravindra Jadeja: రవీంద్ర జాడేజాకు ఫైన్.. ఆ వీడియోలో ఏం జరిగిందంటే..?