Mahashivratri 2023: మహా శివరాత్రి ఈ 5 రాశులపై కనకవర్షం కురిపించడం ఖాయం

Mahashivratri 2023: స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే ఐశ్వర్యం, సమృద్ధి, ధనం లభిస్తుందని నమ్మకం. మహా శివరాత్రి ముఖ్యంగా 5 రాశులకు అత్యంత లాభదాయకం. ఈ రాశులవారిపై మహాదేవుడి కటాక్షం కురుస్తుంది. ఆ రాశుల గురించి తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 12, 2023, 06:30 AM IST
Mahashivratri 2023: మహా శివరాత్రి ఈ 5 రాశులపై కనకవర్షం కురిపించడం ఖాయం

మహా శివరాత్రి ఫిబ్రవరి 18వ తేదీన ఉంది. ఈసారి మహా శివరాత్రిని అత్యంత శుభ సూచకంగా పిలుస్తున్నారు. ఎందుకంటే శని ప్రదోషం ఉంటోంది. ఈ రోజున పూజలు చేస్తే శని దోషం తొలగిపోతుందట. ఫలితంగా ఆ శివుడి కటాక్షంతో భక్తుల కష్టాలు తొలగిపోతాయి. నిజమైన, స్వచ్ఛమైన మనస్సుతో శివుడిని పూజిస్తే..ఐశ్వర్యం, సమృద్ధి, ధనం ప్రాప్తిస్తుంది. మహా శివరాతికి 5 రాశుల జాతకాలపై అత్యంత శుభసూచకంగా ఉంది. ఈ రాశులపై మహా దేవుడు కనకవర్షం కురిపించనున్నాడు. 

మేషరాశి

మేషరాశి వారికి మహా శివరాత్రి నాడు శుభయోగం కారణంగా ఊహించని లాభం కలగనుంది. ఏదైనా వస్తువు పొందేందుకు ప్రయత్నిస్తుంటే అందులో లాభం కలుగుతుంది. కెరీర్‌లో విజయం లభిస్తుంది. ఆర్ధిక వ్యవహారాల్లో ప్రయోజనం కలుగుతుంది. కుటుంబంలో ఎవరైనా వ్యక్తికి ఉద్యోగం లభిస్తుంది. కానీ ఈ సందర్భంగా సంయమనంతో పనిచేయాల్సి వస్తుంది. కోపాన్ని నియంత్రించుకోవాలి. 

వృషభ రాశి

మహా శివరాత్రి నాడు వృషభ రాశివారికి కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యక్తిగత జీవితంలో కష్టాలు దూరమౌతాయి. పెళ్లి కానివారి జీవితంలో భాగస్వామి ప్రవేశముంటుంది. ఒకవేళ ఉద్యోగం మారే ఆలోచన ఉంటే ఆ ప్రయత్నం ఫలిస్తుంది. నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందుతారు. డబ్బుల కష్టాలు తొలగిపోతాయి. శివుడికి ప్రతి సోమవారం నాడు ఆకండే పూలు సమర్పించాలి.

తులా రాశి

మహా శివరాత్రి తులా రాశి జాతకులకు అత్యంత లాభదాయకం. కెరీర్ విషయంలో కష్టాలు తొలగిపోతాయి. దాంతోపాటు ఆర్ధిక వ్యవహారాల్లో లాభం ఉంటుంది. ఈ క్రమంలో మీరు తీసుకునే నిర్ణయాలు లాభిస్తాయి. జీవితంలో ఆనందం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలుంటాయి. ఒకవేళ జీవిత భాగస్వామి సలహాతో డబ్బులు పెట్టుబడి పెడితే..అందులో మంచి లాభాలుంటాయి. ప్రతి సోమవారం నాడు శివలింగానికి పాలలో గంగాజలం కలిపి అభిషేకం చేయాలి.

ధన రాశి

మహా శివరాత్రి నాడు ఈ రాశివారి జీవితం సంతోషంతో నిండిపోతుంది. జీవితంలో ఎన్నో పాజిటివ్ మార్పులు సంభవిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలుంటాయి. ఒకవేళ ఎవరైనా అనారోగ్యం బారినపడితే ఆరోగ్యం మెరుగుపడుతుంది. దైనందిన జీవితానికి సంబంధించిన ప్రతి పనిలో విజయం లభిస్తుంది. వ్యాపారంలో ఊహించని లాభం కలుగుతుంది. ప్రతి రోజూ శివుడికి పసుపు చందనం సమర్పించాలి.

కుంభ రాశి

మహా దేవుడి కటాక్షం కుంభరాశిపై ఉంటుంది. అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. కుటుంబం, కెరీర్‌కు సంబంధించిన కష్టాల్నించి విముక్తి లభిస్తుంది. ఆర్ధిక కష్టాలు తొలగిపోతాయి. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఆదాయానికి కొత్త మార్గాలు తెర్చుకుంటాయి. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగం మారే ఆలోచన ఉంటే మంచి ఆవకాశాలు లభిస్తాయి. శనీశ్వరాలయంలో శనివారం నాడు దర్శనం చేసుకోవాలి.

Also read: Rajyog effect: ఈరాశుల జాతకంలో అరుదైన రాజయోగం.. వీరు జాక్ పాట్ కొట్టడం ఖాయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News