IRCTC Jyotirlinga Tour: మహా శివరాత్రి పర్వదినాన్ని దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. ఈ మహా పండుగ సందర్భంగా శివ భక్తులకు ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతి తక్కువ ఖర్చుతో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకునే గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. 'మహాశివరాత్రి నవ జ్యోతిర్లింగ యాత్ర' పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ ద్వారా మీరు దేశంలోని వివిధ ప్రాంతాలకు చాలా తక్కువ ధరలలో ప్రయాణించవచ్చు. ఈ ప్యాకేజీ వివరాలు ఇలా..
ఈ ప్యాకేజీ ద్వారా ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగ, మహాకాళేశ్వర జ్యోతిర్లింగ, సోమనాథ్ జ్యోతిర్లింగ, త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ, భీమశంకర్ జ్యోతిర్లింగ, ఘృష్ణేశ్వర జ్యోతిర్లింగ, ఔంధ నాగనాథ్ జ్యోతిర్లింగ, పర్లి వైజనాథ స్వామి, జ్యోతిర్జున స్వామిని దర్శించుకోవచ్చు. భారత్ దర్శన్ రైలు ద్వారా మీరు ఈ ప్రదేశాలన్నింటినీ సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ రైలులో బుకింగ్ కోసం మీరు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి. ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో కూడా టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
పర్యటన ఇలా ఉండనుంది..
==> తేదీ: మార్చి 08 నుంచి మార్చి 20వ తేదీ వరకు
==> ఎన్నిరోజులు: 12 రాత్రులు/13 రోజులు
==> ప్యాకేజీ కోడ్: SZBD384A
==> ఎక్కడి నుంచి ప్రారంభం: మధురై
==> బోర్డింగ్ పాయింట్స్: తిరునియోవేలి, వరుదునగర్, మధురై, దిండిగల్, కరూర్, ఈరోడ్, సేలం, వరంగల్, విజయవాడ, జోలార్‌పేటై, కాట్పాడి, పెరంబూర్, నెల్లూరు.
==> ఖర్చు: రూ. 15,350
వివిధ స్టేషన్లలో రైలు రాక, బయలుదేరే సమయం తాత్కాలికంగా ఉంటుంది. ఇది రైల్వే అనుమతిపై ఆధారపడి ఉంటుంది. టికెట్ బుక్ చేసుకున్న తరువాత ప్రయాణికులు రద్దు చేసుకుంటే రిఫండ్ ఉండదు.
సౌకర్యాలు ఇలా..
==> ఈ ప్యాకేజీలో మీరు రైలులో స్లీపర్ కోచ్‌లో ప్రయాణించే సౌకర్యాన్ని పొందుతారు.
==> మీరు ప్రతిచోటా బస చేయడానికి సరైన ఏర్పాటును పొందుతారు.
==> ప్రయాణికులందరికీ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్‌తో పాటు ఒక లీటర్ వాటర్ బాటిల్ కూడా లభిస్తుంది.
==> ప్రయాణికులందరికీ టూర్ ఎస్కార్ట్, భద్రత సౌకర్యం కూడా లభిస్తుంది.
Also Read: Hyderabad Fake Baba: దెయ్యం పట్టిందంటూ యువతులకు దొంగ బాబా వల.. 8వ పెళ్లికి ముందు ఊహించని ట్విస్ట్
Also Read: Ind Vs Aus 1st Test: తోక ముడిచిన ఆసీస్.. ఇన్నింగ్స్ తేడా టీమిండియా భారీ విజయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook