Electric Chetak Scooter : బజాజ్ కంపెనీ త్వరలో భారతదేశంలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది. ఈ స్కూటర్ బజాజ్ చేతక్‌ను పోలి ఉంటుందని సమాచారం. ఎలక్ట్రిక్ వెర్షన్‌తో ఈ చేతక్‌ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతున్నారని తెలుస్తోంది. అయితే ఇంతక ముందే బజాజ్ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటీ 2020లో విడుదల చేసింది. ఇక ఇప్పుడు విడుదల కాబోయే చేతక్ స్కూటీ చాలా రకాల కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్నట్లు పలువురు నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో భారీగా డిమాండ్ ఉన్న స్కూటీలతో పోటి పడబోతోంది. అయితే ఈ స్కూటీకి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ స్కూటర్ రేంజ్:
బజాజ్ చేతక్ అధనాత ఫీచర్లతో మార్కెట్లోకి రాబోతోంది. ప్రస్తుతం ఈ మోడల్ స్కూటీ ఒక్క సారి ఛార్జ్ చేస్తే.. దాదాపు 90 కిమీకి వరకు మైలేజీని ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ స్కూటర్ పరిధిని ముందు ముందు పెంచే ఛాస్స్ కూడా ఉందని కంపెనీ అధికారిక ప్రకటనలతో పేర్కోంది. ప్రస్తుతం మార్కెట్లో Ather 450X 146 కిమీ, Ola S1 ప్రో 181 కిమీ, TVS iQube ST 145 కిమీ రేంజ్ మైలేజీని ఇవ్వగా.. రాబోయే బజాజ్ చేతక్ దాదాపు 110 కిమీ ఇచ్చే అవకాశాలున్నాయి.
బజాజ్ చేతక్ 4080 వాట్ BLDC మోటార్‌తో రాబోతోంది. అంతేకాకుండా మీరు ఇంతక ముందు చూడని చాలా ఫీచర్లు ఇప్పుడు ఈ స్కూటీలో చూడొచ్చు. ఇక బ్యాటరీ రేంజ్ విషయానికొస్తే 50.4 V/60.4 Ah పవర్‌తో పాటు 80 కి.మీల రేంజ్‌తో లభించబోతోంది. ఇది మార్కెట్లో వేరియంట్ ప్రీమియంలో మాత్రమే విడుదల చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్ LED లైటింగ్, టర్న్ సిగ్నల్స్, డిజిటల్ బ్లూటూత్ ఇన్స్ట్రుమెంటేషన్ క్లస్టర్ ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
కొత్త స్కూటర్ ధర ఎంత?:
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు 3 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో లభించనుంది. ఇది 16 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా ఎకో, స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్లతో లభించనుంది. అయితే దీని ధర మార్కెట్లో రూ. 1.52 లక్షలు (ఎక్స్-షోరూమ్)తో మార్కెట్లో లభించబోతోంది. అయితే ఈ కంపెనీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడం వల్ల ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి : Hyundai verna 2023: కేవలం రూ. 25 వేలు చెల్లించి కొత్త హ్యూందాయ్ కారు బుక్ చేసుకోండి
ఇది కూడా చదవండి : Samsung Galaxy S23 Ultra: ఈ 200MP కెమెరా సూపర్ స్మార్ట్ ఫోన్‌పై రూ. 8వేల డిస్కౌంట్
ఇది కూడా చదవండి : Okaya Faast F3 EV Scooter: మార్కెట్లోకి మరో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆకట్టుకుంటున్న ఫీచర్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook