Kajol Video : ఒకేసారి అన్ని పనులా?.. కాజోల్ వీడియో వైరల్

Kajol Makeup and stitching Video బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హిందీ సినిమాల్లోనే ఎక్కువగా నటించినా.. సౌత్ వారికి కూడా సుపరిచితురాలే. ప్రభుదేవా, అరవింద్ స్వామి వంటి వారి సరసనా నటించింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 17, 2023, 01:01 PM IST
  • నెట్టింట్లో కాజోల్ సందడి
  • మల్టీ టాలెంట్‌గా స్టార్ హీరోయిన్
  • కాజోల్ టాలెంట్‌కు నెటిజన్లు ఫిదా
Kajol Video : ఒకేసారి అన్ని పనులా?.. కాజోల్ వీడియో వైరల్

Ajay Devgan Wife Kajol Makeup Video సిల్వర్ స్క్రీన్ మీద కొన్ని జోడిలు ఎప్పటికీ అలా నిలిచిపోతుంటాయి. 90వ దశకంలో అలాంటి ఓ జోడియే షారుఖ్ ఖాన్ కాజోల్. ఈ ఇద్దరూ కలిసి చేసిన ఎన్నో సినిమాలు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎవర్ గ్రీన్‌గా కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయాయి. షారుఖ్ కాజోల్ జోడికి ఆన్ స్క్రీన్ మీద విపరీతమైన క్రేజ్ ఉంటే.. ఆఫ్ స్క్రీన్, రియల్ లైఫ్‌లో అజయ్ దేవగణ్, కాజోల్‌ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.

అజయ్, కాజోల్ ప్రేమ, పెళ్లి, పర్సనల్ లైఫ్‌ గురించి అందరికీ తెలిసిందే. ఇక ఈ ఇద్దరూ సోషల్ మీడియాలో పెట్టుకునే ముచ్చట్లు సైతం వైరల్ అవుతుంటాయి. ఒకసారి అనుకోకుండా కాజోల్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసేశాడట అజయ్. అలా సెట్స్ మీద నుంచి అజయ్ చేసిన ఆ పనికి కాజోల్‌ కౌంటర్లు వేసింది. ఇంటికి రండి మీ పని చెబుతా అన్నట్టుగా కౌంటర్లు వేసింది. అయితే అది ప్రాంకా? నిజంగానే అది కాజోల్ నంబరా? అన్నది మాత్రం క్లారిటీ లేదు.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kajol Devgan (@kajol)

అలా కాజోల్, అజయ్ దేవగణ్‌లు ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటారు. ఇక ఈ ఇద్దరూ చివరగా కలిసి చేసిన తానాజీ సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. ఈ ఇద్దరూ కలిసి చేసిన సినిమాలన్నీ కూడా దాదాపుగా హిట్ అయ్యాయి. అలా వరుసగా సినిమాలు చేస్తూ ఉండటంతోనే వీరి మధ్య ప్రేమ చిగురించేసింది.

ఇప్పుడు కాజోల్‌కు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అందులో తనకు ఓ వైపు మేకప్ వేస్తున్నారు. హెయిర్స్, ఫేస్ ఇలా అన్ని చోట్ల మేకప్ వేస్తుంటే.. కాజోల్ మాత్రం స్టిచ్చింగ్ చేస్తూనే ఉంది. చూడకుండానే వేగంగా కుట్టేస్తోంది కాజోల్. ఇది చూసిన జనాలు.. నిజంగానే కాజోల్ మల్టీ టాలెంటెడ్ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా కాజోల్ వల్లే సాధ్యం అవుతుంటాయేమో అని పొగిడేస్తున్నారు.

Also Read:  Aditya Roy Kapoor Lady Fan : మీద మీదకు వచ్చి ముద్దు పెట్టబోయిన ఆంటీ.. స్టార్ హీరో పరిస్థితి ఎలా అయిందంటే?

Also Read: Samantha Ruth Prabhu on Rana : ఆగలేకపోతోన్నా!.. వెంకీమామా, రానాలపై సమంత ప్రేమ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News