King Cobra Vs Snake Catcher: స్నేక్ క్యాచర్‌నే రఫ్ఫాడించిన కింగ్ కోబ్రా.. పొదల్లోంచి లాక్కొచ్చి మరీ నీరు త్రాగించిన వ్యక్తి!

King Cobra - Snake Catcher: కింగ్ కోబ్రాని చూస్తేనే వణికిపోతాం.. అలాంటిది ఈ స్నేక్ క్యాచర్ భయంకర కింగ్ కోబ్రాని బందించి నీరు తాగించాడు.. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. 

Written by - P Sampath Kumar | Last Updated : Feb 24, 2023, 04:07 PM IST
  • స్నేక్ క్యాచర్‌నే రఫ్ఫాడించిన కింగ్ కోబ్రా
  • బంధించి మరీ నీరు త్రాగించిన వ్యక్తి
  • ఒళ్లు గగుర్పొడిచే వీడియో
King Cobra Vs Snake Catcher: స్నేక్ క్యాచర్‌నే రఫ్ఫాడించిన కింగ్ కోబ్రా.. పొదల్లోంచి లాక్కొచ్చి మరీ నీరు త్రాగించిన వ్యక్తి!

King Cobra Vs Snake Catcher Viral Video: ఈ భూ ప్రపంచంలో అత్యంత విషపూరితమైన పాములలో 'కింగ్ కోబ్రా' ముందువరసలో ఉంటుంది. పాములు అన్నింటిలో కెల్లా కింగ్ కోబ్రా  అత్యంత పొడవైనది. ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో సంచరించే కింగ్ కోబ్రా భారత దేశ అటవీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. కింగ్ కోబ్రా కాటు వేస్తే 10-15 నిమిషాల్లో మనిషి ప్రాణాలుపోతాయి. ఈ పాము కాటుకు భారీ ఏనుగు ప్రాణాలు కూడా నిమిషాల్లో గాల్లో కలిసిపోతాయి.  సాధారణ పాము మాదిరే కింగ్ కోబ్రా విషం ఉన్నా.. అది కాటేసే సమయంలో ఎక్కువ విషంను చిమ్ముతుంది. అందుకే కింగ్ కోబ్రా అంటే అందరూ భయపడిపోతారు. 

కింగ్ కోబ్రాను సాధారణ మనిషి పట్టుకోవడం కాదు కదా.. చంపడం అసాధ్యమే. స్నేక్ క్యాచర్‌లు మాత్రమే కింగ్ కోబ్రాను పట్టుకుంటారు. భారీ సైజ్ కింగ్ కోబ్రాలు కొన్ని స్నేక్ క్యాచర్‌లకు కూడా చుక్కలు చూపిస్తాయి. అయినా సరే కొందరు చాలా రిస్క్ చేసి వాటిని కాపాడుతుంటారు. అంతరించిపోతున్న పాములను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న కొందరు సీనియర్ స్నేక్ క్యాచర్‌లు ఎంతటి పామునైనా పట్టుకుంటారు. 15-20 అడుగుల భారీ కింగ్ కోబ్రాను కూడా వీరు చాకచక్యంగా పట్టుకుని బంధిస్తారు. బుసలు కొట్టినా సరే ఏమాత్రం భయపడరు. తాజాగా అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.

వీడియో ప్రకారం... ఒడిశాలోని ఓ గ్రామంలోని పంట పొలాల్లో కూలీలు పని చేస్తుండగా వారికి భారి కింగ్ కోబ్రాకనిపించింది. పామును చూసి హడలిపోయిన వారు.. స్నేక్ క్యాచర్‌ సర్పమిత్ర ఆకాష్ జాదవ్‌‌కి సమాచారం అందిస్తారు. చేనులో పామును కనిపెట్టి దాని తోకను పట్టుకుని నెమ్మదిగా లాగుతాడు. కింగ్ కోబ్రా బుసలు కొడుతున్నా అస్సలు బెదరకుండా చేనులోంచి బయటికి తీసుకొస్తాడు. రోడ్డుపై వేసి దాని సంచిలో బంధించే క్రమంలో జాదవ్‌‌కి కోబ్రా చుక్కలు చూపిస్తుంది. కాటేయడానికి మీదికి వచ్చినా వదలకుండా పామును బంధిస్తాడు. దీంతో పాము కూల్ అవుతుంది.

స్నేక్ క్యాచర్‌ సర్పమిత్ర ఆకాష్ జాదవ్ పట్టిన భారీ సైజ్ కింగ్ కోబ్రాకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోని 'Sarpmitra Akash Jadhav' అనే యూట్యూబ్ ఛానెల్లో జాదవ్ పోస్ట్ చేశారు. వాస్తవానికి ఈ వీడియో 4 నెలల క్రితందే అయినా.. ఇప్పుడు మరోసారి వైరల్ అయింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 4,627,717 వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. ఒళ్లు గగుర్పొడిచే వీడియో అంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు. 

Also Read: జస్ట్ మిస్.. బ్లాక్ కింగ్ కోబ్రా కాటు నుంచి స్నేక్ క్యాచర్‌ ఎస్కేప్! డేంజరస్ వీడియో

Also Read:  పాత ఇంట్లో 16 అడుగుల కింగ్ కోబ్రా.. స్నేక్ క్యాచర్‌కే చుక్కలు చూపింది! చివరకు ఏమైందంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News