Heeramandi Teaser: రాయల్ ఫ్యామిలీకి పడక సుఖం.. ఖరీదైన వేశ్యల బాగోతమే ఈ హీరామండి

Heeramandi Firt Look Teaser: సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన హీరామండి గ్లింప్స్ చూస్తే.. ఆనాడు మొఘల్ చక్రవర్తుల కుటుంబాలకు సపర్యలు చేసిన వేశ్యలు కూడా నిజంగా మహారాణులకు తగ్గకుండా ఇలా ఉండేవారా అనేంతగా సంజయ్ లీలా భన్సాలీ వారి పాత్రలను ప్రజెంట్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2023, 08:22 PM IST
Heeramandi Teaser: రాయల్ ఫ్యామిలీకి పడక సుఖం.. ఖరీదైన వేశ్యల బాగోతమే ఈ హీరామండి

Heeramandi Firt Look Teaser: హీరామండి.. ఎన్నో సంచలన చిత్రాలు తెరకెక్కించిన ప్రముఖ బాలీవుడ్ ఫిలిం మేకర్ సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్ పేరే ఈ హీరామండి. రాజ వంశీయులకు, రాజ కుటుంబీకులకు ఖరీదైన వేశ్యలు అన్నివిధాల సపర్యలు చేస్తూ రాజులకు పడక సుఖం అందించడం అనేది సినిమాల్లో చూడటం మాత్రమే కాదు.. ఒకప్పుడు అలాంటి సంప్రదాయం నిజంగానే ఉండేదని మరోసారి గుర్తుచేస్తూ సంజయ్ లీలా భన్సాలీ తెరకెకిస్తున్న హీరామండికి సంబంధించిన గ్లింప్స్ రిలీజయ్యాయి. ఒకప్పుడు మొఘల్ చక్రవర్తులను రంజింప చేయడం కోసం ఖరీదైన వేశ్యలు ఉండేవారిని.. 15 - 16వ శతాబ్ధం కాలంలో కొనసాగిన ఓ ఆచారం ఆధారంగా తెరకెక్కిన కథ ఇది అని సంజయ్ లీలా భన్సాలీ చెబుతున్నాడు .

సోనాక్షి సిన్హా, మనీషా కొయిరాల, అదితి రావ్ హైదరి, రిచా చద్దా, శర్మిన్ సెహగల్, సంజీదా షేక్ ప్రధాన పాత్రల్లో నటించిన హీరామండి గ్లింప్స్ చూస్తే.. ఆనాడు మొఘల్ చక్రవర్తుల కుటుంబాలకు సపర్యలు చేసిన వేశ్యలు కూడా నిజంగా మహారాణులకు తగ్గకుండా ఇలా ఉండేవారా అనేంతగా సంజయ్ లీలా భన్సాలీ వారి పాత్రలను ప్రజెంట్ చేశాడు. 

భారత్ , పాకిస్తాన్ విడిపోక ముందు లాహోర్ కి సమీపంలో ఉన్న షాహి మొహల్లా అనే ప్రాంతంలో జరిగిన కొన్ని ఘటనల ఆధారంగా అల్లుకున్న కథ ఇది. ఇంచుమించు ఇలాంటి కథనంతోనే దాదాపు ఓ దశాబ్ధం కిందనే సంజయ్ లీలా భన్సాలీ వెళ్లి కరీనా కపూర్ ఖాన్ ని కలిశాడట. అయితే, కథ మరీ బోల్డ్ గా ఉందంటూ ఆమె రిజెక్ట్ చేసిందని సంజయ్ లీలా భన్సాలీ గుర్తుచేసుకున్నాడు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

 

ఇలాంటి స్టోరీ లైన్‌తోనే తెరకెక్కిన గంగూబాయి కతియావాడి లాంటి సినిమాను తెరకెక్కించిన సంజయ్ లీలా భన్సాలీ హీరామండి గురించి మాట్లాడుతూ.. ఖామోషి చిత్రంలో దివ్యాంగులైన తల్లిదండ్రులను చూసుకునే పాత్రలో మనీషా, హమ్ దిల్ దే చుకేసనం చిత్రంలో నందిని పాత్ర, బాజీరావు మస్తాని చిత్రంలో మస్తానీ పాత్ర, బ్లాక్ చిత్రంలో రాణి పాత్ర.. ఇలా ఏ సినిమా తీసుకున్నా.. ఒక కథలో ఒక మహిళ పోషించే పాత్ర ఆ సినిమాపై ఎంత ప్రాధాన్యతను పెంచుతుందనేదే తనకు ముఖ్యం అని తన చిత్రాల్లోని మహిళా పాత్రల బలాన్ని సంజయ్ లీలా భన్సాలీ ఆకాశానికెత్తారు. అలాంటి పాత్రలే లేకుండా తను సినిమానే చేయను అని చెబుతూ.. మస్తానీ అనే పాత్ర లేకుండా అసలు తాను బాజీరావ్ మస్తానీ చేసి ఉండేవాడినే కాదని అన్నారు.  

సంజయ్ లీలా భన్సాలీని ఆకాశానికెత్తిన నెట్ ఫ్లిక్స్ కో-సీఈఓ టెడ్ శారండోస్ మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సృతనాత్మకత కలిగిన బెస్ట్ కంటెంట్ అందించే క్రియేటర్స్ కథలకే తాము ప్రాధాన్యత ఇస్తామని అన్నారు. సంజయ్ లీలా భన్సాలీ మార్క్ చూపిస్తూ త్వరలోనే హిరామండి నెట్ ఫ్లిక్స్ పై ప్రసారం కానుంది.

ఇది కూడా చదవండి : Surekha Konidela Birthday : ఎందరో లక్ష్మణులకు వదిన.. సీతాదేవి, లక్ష్మీదేవి అంటూ సురేఖ కొణిదెలపై బండ్ల గణేష్‌ ట్వీట్

ఇది కూడా చదవండి : Taraka Ratna Health Live updates : అత్యంత విషమంగా తారకరత్న ఆరోగ్యం.. రేపు మధ్యాహ్నం తరువాత హైదరాబాద్ తరలించే అవకాశం!

ఇది కూడా చదవండి : Hansika Motwani Injection: హన్సిక పెరిగేందుకు హార్మోన్ ఇంజెక్షన్లు.. అసలు విషయం చెప్పేసిందిగా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News