Game On Teaser : రొమాంటిక్‌గా బిగ్ బాస్ వాసంతి.. సీరియస్‌గా మధుబాల.. టీజర్‌లో హైలెట్స్ ఇవే

Vishwak Sen Release Game On Teaser గేమ్ ఆన్ టీజర్‌ను విశ్వక్ సేన్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే మాత్రం రొటీన్ సినిమాలా ఎక్కడా కనిపించడం లేదు. ఏదో కొత్త పాయింట్‌తో సినిమా రాబోతోన్నట్టుగా కనిపిస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 22, 2023, 08:54 AM IST
  • గేమ్ ఆన్ టీజర్ విడుదల
  • యంగ్ హీరో విశ్వక్ సేన్ సాయం
  • టీజర్‌లో వాసంతి, మధుబాల హైలెట్
Game On Teaser : రొమాంటిక్‌గా బిగ్ బాస్ వాసంతి.. సీరియస్‌గా మధుబాల.. టీజర్‌లో హైలెట్స్ ఇవే

Game On Teaser News మధుబాల ప్రస్తుతం తెలుగులో ఫుల్ బిజీ అవుతోంది. వెబ్ సిరీస్‌లు, సినిమాలు అంటూ తెలుగు వారి ముందుకు వస్తోంది. బిగ్ బాస్ షోతో ఫేమస్ అయిన వాసంతి సైతం ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉంది. గీతానంద్, నేహా సోలంకి హీరో హీరోయిన్లుగా నటించిన ‘గేమ్ ఆన్‌’ సినిమాలో మధుబాల, వాసంతి వంటి వారు ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. 

గోల్డెన్ వింగ్ ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యాన‌ర్స్‌పై ద‌యానంద్ ద‌ర్శ‌క‌త్వంలో ర‌వి క‌స్తూరి ఈ సినిమాను ఏ క‌స్తూరి క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ మీద నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ టీజర్‌ను నిన్న విశ్వక్ సేన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఈ టీజర్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు, రొమాంటిక్ సీన్లు అన్నీ ఉన్నాయి. టీజర్ చూస్తుంటే సినిమా మీద ఇంట్రెస్ట్ కలిగించేలా ఉంది.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో మ్యూజిక్ డైరెక్ట‌ర్స్ అశ్విన్ - అరుణ్‌ మాట్లాడుతూ.. తమకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్ అని,  ఇందులో ఒక రొమాంటిక్ ట్రాక్‌ను కంపోజ్ చేశామని, త్వరలోనే పాటలు రిలీజ్ చేస్తామని చెప్పుకొచ్చాడు. నిర్మాత ర‌వి క‌స్తూరి మాట్లాడుతూ.. ఓ పాపలాగా కేర్ తీసుకుని మరీ గేమ్ ఆన్ సినిమాను చేశామని అన్నాడు. ఈ మూవీ ఓ ట్రెండ్ క్రియేట్ చేస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందని అన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News