Bharat Jodo Yatra 2.0: త్వరలో భారత్ జోడో యాత్ర 2.0, ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉంటుంది

Bharat Jodo Yatra 2.0: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ముగిసింది. దేశవ్యాప్తంగా ఆదరణ లభించడంతో బారత్ జోడో యాత్ర 2 త్వరలో ప్రారంభించేందుకు నిర్ణయమైంది. భారత్ జోడో యాత్ర 2 ఎప్పుడు, ఎలా ఉంటుందనేది పరిశీలిద్దాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 27, 2023, 08:13 AM IST
  • త్వరలో దేశంలో భారత్ జోడో యాత్ర 2.0 ప్రారంభం, వెల్లడించిన జైరాం రమేశ్
  • తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుంచి పశ్చిమాన గుజరాత్ వరకూ సాగనున్న భారత్ జోడో యాత్ర 2.0
  • జూన్-నవంబర్ మధ్యకాలంలో జోడో యాత్ర 2 ప్రారంభమయ్యే అవకాశాలు
Bharat Jodo Yatra 2.0: త్వరలో భారత్ జోడో యాత్ర 2.0, ఎలా ఉండబోతుంది, ఎప్పుడు ఉంటుంది

రాయ్‌పూర్‌లో కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. మూడ్రోజుల ప్లీనరీలో ఐదు సూత్రాల డిక్లరేషన్ జరిగింది. మరోవైపు త్వరలో మరో జోడో యాత్రకు సంకల్పించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. భారత్ జోడో యాత్ర 2పై  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ కీలక విషయాలు వెల్లడించారు. 

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభించింది. దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించడంతో పాటు కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ సంకల్పించిన లక్ష్యాలు చాలావరకూ పూర్తయ్యాయనేది పార్టీ భావన. అందుకే ఇప్పుడు దేశంలో మరోసారి జోడో యాత్ర చేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమౌతోంది. రాయ్‌పూర్ కాంగ్రెస్ ప్లీనరీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. 

యాత్ర ఎలా ఉండనుంది

భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి జమ్ము కశ్మీర్ వరకూ 4 వేల కిలోమీటర్లు సాగింది. ఈ యాత్ర ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు ప్రయత్నించారు రాహుల్ గాంధీ. ఇప్పుడు తూర్పు నుంచి పశ్చిమాన్ని కలుపుతూ భారత్ జోడో యాత్ర 2 ప్రారంభించేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. జోడో యాత్ర 2 తూర్పున అరుణాచల్ ప్రదేశ్ నుంచి పశ్చిమాన గుజరాత్ పోరుబందర్ వరకూ ఉండేలా రూట్‌మ్యాప్ సిద్ధం చేయనున్నారు. భారత్ జోడో యాత్ర 1కు ఇది కాస్త భిన్నంగా ఉండవచ్చని జైరాం రమేశ్ తెలిపారు. 

దేశంలోని తూర్పు-పశ్చిమ భాగాల మధ్య యాత్ర కాబట్టి కాస్త భిన్నంగా ఉంటుందన్నారు. తొలి యాత్రలో ఉన్నంతగా మౌళిక సదుపాయాలు జోడో యాత్ర 2లో ఉండకపోవచ్చని జైరాం రమేశ్ అన్నారు. తక్కువ మందితోనే ఈ యాత్ర జరగవచ్చని..మధ్యలో చాలావరకూ అడవులు, నదులే ఉన్నందున కొద్దిదూరం బస్సు ఇతర మార్గాల ద్వారా సాగవచ్చని తెలుస్తోంది. స్థూలంగా చెప్పాలంటే మల్టీ మోడ్ యాత్రగా ఉండనుంది. 

బారత్ జోడో యాత్ర ఎప్పుడు

ఏప్రిల్ నెలలో కర్ణాటక ఎన్నికలున్నాయి. జూన్ నుంచి వర్షాకాలం సీజన్ ప్రారంభం కావచ్చు. నవంబర్ నెలలో కూడా ఎన్నికలుంటాయి. ఈ అన్ని అంశాల్ని పరిగణలో తీసుకుని జూన్-నవంబర్ మధ్యకాలంలో భారత్ జోడో యాత్ర 2 ప్రారంభించవచ్చని సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలువడవచ్చు.

Also read: Old Pension Scheme: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పెన్షన్‌ విధానంలో కీలక మార్పులు..?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News