Lowest Total in T20 history: టీ20ల్లో చెత్త రికార్డు.. పది పరుగులకే ఆలౌట్.. 2 బాల్స్ లో మ్యాచ్ పూర్తి!

Lowest Score: సాధారణంగా టీ20 క్రికెట్ అంటే బ్యాట్ దే ఎక్కువ ఆధిపత్యం కనిపిస్తుంది. కానీ బౌలర్లు విజృంభిస్తే ఇలా ఉంటుందా అని ఐల్ ఆఫ్ మ్యాన్-స్పెయిన్ మ్యాచ్ నిరూపించింది. కేవలం పది పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకుంది ఐల్ ఆఫ్ మ్యాన్ టీమ్.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 28, 2023, 08:42 AM IST
Lowest Total in T20 history: టీ20ల్లో చెత్త రికార్డు.. పది పరుగులకే ఆలౌట్.. 2 బాల్స్ లో మ్యాచ్ పూర్తి!

Lowest Total in T20 history: పొట్టి క్రికెట్ హిస్టరీలోనే చెత్త రికార్డు నమోదైంది. ఓ జట్టు పది పరుగులకే అలౌటై అపఖ్యాతి మూటగట్టుకుంది. ఆదివారం జరిగిన టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెట్ జట్టును (Isle of Man) స్పెయిన్  జట్టు 10 పరుగులకే కుప్పకూల్చి..చరిత్ర సృష్టించింది. 

మెుదట బ్యాటింగ్ చేసిన ఐల్ ఆఫ్ మ్యాన్ క్రికెట్ జట్టు పది పరుగులకే చతికిలపడింది. ఆ జట్టులో ఏకంగా ఏడుగురు బ్యాటర్లు డకౌట్ కావడం విశేషం. ఆ జట్టు ఆటగాళ్లలో జోసెఫ్ బర్రోస్ 4 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన మహ్మద్ కమ్రాన్ మూడో ఓవర్‌లో ల్యూక్ వార్డ్, కార్ల్ హార్ట్‌మన్ మరియు ఎడ్వర్డ్ బార్డ్‌లను అవుట్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. స్పెయిన్ బౌలర్లలో కమ్రాన్, అతిఫ్ మెహమూద్ చెరో 4 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన స్పెయిన్‌ (Spain team) 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్ అవైస్ అహ్మద్ తొలి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదాడు. కేవలం రెండు బంతుల్లోనే అంతర్జాతీయ మ్యాచ్‌లో విజయం సాధించిన ఏకైక జట్టుగా స్పెయిన్ నిలిచింది. దీంతో ఈ ఆరు మ్యాచ్ ల సిరీస్ ను స్పెయిన్ క్వీన్ స్వీప్ చేసింది. కాగా T20 ఫార్మాట్‌లో గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బాష్ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్‌పై సిడ్నీ థండర్ కేవలం 15 పరుగులకే చాప చుట్టేసింది. ఇప్పుడు ఆ రికార్డును ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు చెరిపేసింది. 

Also Read: Ishant Sharma: ఆ ఓవర్ దెబ్బకు నెల రోజులు ఏడ్చిన ఇషాంత్ శర్మ.. ఎందుకంటే..? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News