Tatkaal passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, కావల్సిన అర్హతలేంటి

Tatkaal passport: పాస్‌పోర్ట్. విదేశాలకు వెళ్లాలంటే తప్పనిసరిగా కావల్సిన ఆ దేశ నాగరికుడిగా గుర్తింపు కార్డు. ఇందులో సాధారణ, తత్కాల్ సేవలు రెండూ అందుబాటులో ఉంటాయి. తత్కాల్‌లో పాస్‌పోర్ట్ అప్లై చేయాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనేది తెలుసుకుందాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 28, 2023, 10:21 AM IST
Tatkaal passport: తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి, కావల్సిన అర్హతలేంటి

మీరు హఠాత్తుగా అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుుడు పాస్‌పోర్ట్ లేకపోతే మొత్తం ప్రయాణం నిలిచిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో తత్కాల్ కింద తక్షణం పాస్‌పోర్ట్ పొందే అవకాశముంటుంది. అత్యవసర సందర్బాల్లో వెంటనే పాస్‌పోర్ట్ పొందే అవకాశాన్ని భారత విదేశాంగ శాఖ కల్పిస్తోంది. 

పాస్‌పోర్ట్ అనేది ఓ దేశ నాగరికుడిగా ఆ దేశం ఇచ్చే ప్రత్యేకమైన గుర్తింపు కార్డు. ఐడీ కోసం ఉపయోగించే వివిధ రకాల కార్డుల్లో అత్యున్నతంగా భావించేది ఇదే. అత్యవసరంగా విదేశాలకు వెళ్లాల్సి వస్తే తత్కాల్ పాస్‌పోర్ట్ సౌలభ్యం ఉంది. సుదీర్ఘమైన డాక్యుమెంటేషన్, వెరిఫికేషన్ ప్రక్రియ లేకుండా తక్షణం పాస్‌పోర్ట్ పొందవచ్చు. అయితే అత్యవసర సేవ కాబట్టి 2 వేల రూపాయలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 

మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్‌టెర్నల్ ఎఫైర్స్ ప్రకారం తత్కాల్ పాస్‌పోర్ట్ అనేది సంబంధిత వ్యక్తికి పాస్‌పోర్ట్ కేటాయించిన తరువాత పోలీసు వెరిఫికేషన్ ఉంటుంది. అయితే తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసేముందు ఫీజు, అర్హత, ఇతర సమాచారానికి సంబంధించిన విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.

తత్కాల్ పాస్‌పోర్ట్‌కు కావల్సిన అర్హత

తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం అప్లై చేసే దరఖాస్తుదారుడికి 18 ఏళ్లు నిండి ఉండాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్లికేషన్‌తో పాటు జత చేయాలి. తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎవరు దరఖాస్తు చేయవచ్చనే విషయంలో కొన్ని ఆంక్షలున్నాయి. అయితే తుది నిర్ణయం తీసుకునేది మాత్రం సంబంధిత పాస్‌పోర్ట్ ఆఫీసే. కొన్ని నిబంధనలకు లోబడి పాస్‌పోర్ట్ అప్లికేషన్ తిరస్కరించవచ్చు కూడా. 

తత్కాల్ పాస్‌పోర్ట్ తిరస్కరించేందుకు కారణాలు

1. విదేశంలో పుట్టిన భారతీయుడైతే తత్కాల్ పాస్‌పోర్ట్ అప్లికేషన్ తిరస్కరించవచ్చు.
2. ఇతర దేశాల్నించి ఇండియాకు వలస వచ్చినవారు
3. ప్రభుత్వ ఖర్చులపై సొంతదేశం ఇండియాకు రిటర్న్ అయినవారు
4. నాగాలాండ్, జమ్ము కశ్మీర్‌కు చెందిన దరఖాస్తుదారులు. నాగాలాండ్‌కు వెలుపల నివసించే నాగాలాండ్ పౌరులు
5. భారతదేశ, అంతర్జాతీయ తల్లిదండ్రులు దత్తత తీసుకున్న పిల్లలు

తత్కాల్ పాస్‌పోర్ట్ కోసం ఎలా అప్లై చేయాలి

ముందుగా పాస్‌పోర్ట్ సేవ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మీ ఎక్కౌంట్ రిజిస్టర్ చేసుకోవాలి. మీరు సమర్పించిన క్రెడెన్షియల్స్ ఆధారంగా లాగిన్ కావాలి. న్యూ పాస్‌పోర్ట్ లేదా పాత పాస్‌పోర్ట్ రీ ఇష్యూ అని మెనూలో ఉంటుంది. ఇందులో అవసరమైన దానిని ఎంచుకోవాలి. మెనూలో ఇచ్చిన తత్కాల్ ప్లాన్ ఎంచుకోవాలి. ఫిల్ చేసిన దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇచ్చిన నిర్ణీత తేదీ, సమయానికి పాస్‌పోర్ట్ సేవా కేంద్రానికి వెళ్లాలి. అవసరమైన డాక్యుమెంట్లు చెక్ చేసుకుని సమర్పించాలి. ఐడీ ప్రూఫ్, డాక్యుమెండ్స్ కాపీలు తప్పకుండా అప్లికేషన్‌కు జత చేర్చాలి.

Also read: Toyota Innova Hycross: వావ్.. హ్యూందాయ్ క్రెటా ధరలోనే 8 సీట్ల లగ్జరీ ఇన్నోవా కారు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News