Tata Safari EV Testing starts in India: ప్రముఖ కార్ల తయారీదారు 'టాటా మోటార్స్' తన ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను విస్తరించాలని యోచిస్తోంది. ప్రస్తుత మోడళ్లకు జనరేషన్ మార్పులు మరియు మిడ్-లైఫ్ అప్డేట్లను కూడా అందిస్తుంది. అంతేకాదు టాటా కంపెనీ తన హ్యారియర్ మరియు సఫారీ ఎస్‌యూవీల నవీకరించబడిన వెర్షన్లను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. అయితే వాటి లాంచ్ తేదీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇది మాత్రమే కాదు టాటా కంపెనీ తన సఫారీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ టెస్టింగ్ ప్రారంభించింది. ఈ కారు ఇటీవల స్పైడ్ టెస్టింగ్ చేయబడింది.
టాటా సఫారి ఈవీ యొక్క స్పాటెడ్ టెస్ట్ మ్యూల్.. టాటా హారియర్ ఈవీలో కనిపించే కొన్ని డిజైన్ అంశాలను చూపిస్తుంది. ఈ కారు 2023 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించబడింది. హారియర్ ఈవీ టాటా యొక్క జెన్ 2 (సిగ్మా) ఆర్కిటెక్చర్‌పై ఆధారపడింది. ఇది ఒమేగా ఆర్క్ ప్లాట్‌ఫారమ్ యొక్క రీ-ఇంజనీరింగ్ వెర్షన్. ఈ కారు ఇంధన ట్యాంక్ ప్రాంతం మరియు ఫ్లాట్ ఫ్లోర్లో ప్రధాన మార్పులు చేయబడ్డాయి. ఈ కారు ప్రస్తుత ఒమేగా ప్లాట్‌ఫారమ్ కంటే తేలికగా మరియు మరింత శక్తిని సమర్థవంతంగా చేస్తుంది.
వెహికల్-టు-లోడ్ (V2L) మరియు వెహికల్-టు-వెహికల్ (V2V) ఛార్జింగ్ సామర్ధ్యంతో హ్యారియర్ ఈవీ AWD సిస్టమ్‌తో వస్తుందని టాటా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇందులో దాదాపు 60kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది దాదాపు 400-500km పరిధిని అందించగలదని అంచనా. ఎలక్ట్రిక్ ఎస్యూవీ కాన్సెప్ట్ కొత్త బ్లాంక్డ్-ఆఫ్ గ్రిల్, ట్వీక్డ్ ఫ్రంట్ బంపర్, హెడ్‌ల్యాంప్ క్లస్టర్ చుట్టూ బ్లాక్ హౌసింగ్ మరియు బ్లాంక్డ్-ఆఫ్ ప్యానెల్లతో రివైజ్ చేయబడిన సెంట్రల్ ఎయిర్ ఇన్‌టేక్‌ను కలిగి ఉంటుంది.
ఈ కారు ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ఫెండర్లపై 'EV' బ్యాడ్జ్, వెనుకవైపు కొత్త LED లైట్ బార్‌తో రివైజ్డ్ టైలాంప్ అసెంబ్లీని కూడా కలిగి ఉంటుంది. పైన పేర్కొన్న అన్ని లక్షణాలను టాటా సఫారి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో చూడవచ్చు. హారియర్ ఈవీ యొక్క మూలకాలు సఫారి ఈవీలో చూడవచ్చు.
Also Read: WPL 2023: ఐపీఎల్ జట్లకు విదేశీ కెప్టెన్లు ఉండటం సరైంది కాదు.. అంజుమ్ చోప్రా కీలక వ్యాఖ్యలు!
Also Read: Akshay Kumar Lehenga: లెహంగా ధరించి.. హీరోయిన్‌తో డాన్స్ చేసిన స్టార్ హీరో! ఊపుడు మాములుగా లేదుగా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.