ఢిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. విమానాశ్రయంలో తనిఖీ జరిపిన కస్టమ్స్ అధికారులకు ఊహించని రీతిలో షాక్ ఇచ్చే పరిణామం ఎదురైంది. అటువంటి చోట బంగారం కడ్డీలు ఉంటాయని కస్టమ్స్ అధికారులు పొరపాటున కూడా ఊహించి ఉండరు. అసలేం జరిగిందంటే..
ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. అది కూడా విమానం టాయ్‌లెట్‌లో ఈ బంగారం లభించింది. ఏదో అనుమానం మేరకు విమానాశ్రయంలో, విమానంలో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టగా ఎయిర్‌క్రాఫ్ట్ టాయ్‌లెట్‌లో దాదాపు 4 కిలోల బరువున్న బంగారం కడ్డీలు లభ్యమయ్యాయి. వీటి బరువు 3.969 కిలోలుంది. ఈ బంగారం విలువ 2 కోట్ల వరకూ ఉండవచ్చని కస్టమ్స్ అధికారుల అంచనా. విమానాశ్రయాల్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఎన్ని తనిఖీలు చేస్తున్నా బంగారం అక్రమ సరఫరా యధేచ్ఛగా సాగిపోతోంది. కొన్నిసార్లు పట్టుబడుతుంటే చాలాసార్లు తప్పించుకుపోతున్నారు.
కస్టమ్స్ అధికారులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. అంతర్జాతీయ విమానం రెండు డొమెస్టిక్ ట్రిప్‌లకు వెళ్లొచ్చి..ఎయిర్‌పోర్ట్ టర్మినల్ 2లో ఆగింది. ఈ సందర్భంగా సోదాలు నిర్వహించగా వాష్‌రూమ్ సింక్ కింద బూడిద రంగు సంచి కన్పించింది, ఇందులో ఈ బంగారం కడ్డీలు లభ్యమయ్యాయి. కస్టమ్స్ చట్టం సెక్షన్ 110 ప్రకారం బంగారం, ప్యాకింగ్ మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.
Also read: Elections 2023: ఎమ్మెల్యే కార్యాలయానికి నిప్పు పెట్టిన సొంత కార్యకర్తలు.. కారణం ఇదే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook