Why People Drink Bhang on Holi : భాంగ్ .. హోలీ వేడుకల సమయంలోనే అత్యధికంగా ప్రాచుర్యంలోకి వచ్చే ఈ సాంప్రదాయ పానీయాన్ని అనాధి కాలం నుంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిపే సమయంలోనూ సేవిస్తుంటారు. హోలీ పండగ వేడుకల్లో భాంగ్ పానియం సేవించడం అనేది పండగలో ఒక భాగమైపోయింది. అయితే, ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే... భాంగ్‌ని మోతాదుకు మించి సేవిస్తే.. అది ప్రతికూల ప్రభావాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. అది దృష్టిలో ఉంచుకుని పరిమితమైన మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఫీమేల్ గంజాయి మొక్కల ఆకులు, పువ్వులని ఒక మిశ్రమంగా తయారు చేసి దానిని పాలు, సుగంధ ద్రవ్యాలు, పంచదారతో కలిపి సేవిస్తారు.
ప్రత్యేకించి హోలీ రోజునే భాంగ్ ఎందుకు సేవిస్తారంటే..
భాంగ్ అనేది మొక్కల నుంచి తయారయ్యే పానియం కావడం వల్ల ఇందులో ఔషధ గుణాలు ఉంటాయనే విశ్వాసం ఉంది. మనస్సు, శరీరానికి ఉల్లాసం కలిగించే ప్రభావం ఉండే పానియం కావడం వల్లే హోలీ వేడుకల్లో భాగంగా ఈ భాంగ్ పానియాన్ని సేవించే ఆనవాయితీ పూర్వకాలం నుంచే ఉంది. హోలీ సమయంలో శివుడిని పూజిస్తారని.. అందుకే ఆ పరమ శివుడికి ఇష్టమైన పానియంగా చెప్పుకునే భాంగ్‌ని సేవించడం ఒక ఆనవాయితీగా మారిపోయింది.
భాంగ్ పానియం సేవిస్తే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం: భాంగ్ పానియం సేవించడం వల్ల మానసింగా, శారీరకంగా కలిగే ఉల్లాసం మానసిక ఒత్తిడి, ఆందోళనల నుంచి తాత్కాలికమైన ఉపశమనం ఇస్తుంది. అయితే, ఒత్తిడి నుంచి బయటపడేందుకు దీనిని ఒక అలవాటుగా మాత్రం చేసుకోరాదు.
జీర్ణ ప్రక్రియ: భాంగ్ పానియం జీర్ణక్రియను పెంచుతుందంటారు. ఇది సేవించడం వల్ల అజీర్ణం, ఉబ్బరం, మలబద్ధకం వంటి అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చని చెబుతుంటారు.
శరీరం నొప్పులు, వాపు వంటి సమస్యల నుండి ఉపశమనం: భాంగ్ పానియంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్ వంటి సమస్యల వల్ల వచ్చే నొప్పిని నివారించడానికి ఉపయోగపడతాయి.
రోగనిరోధక శక్తి: భాంగ్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచి, శరీరంలో ఉండే ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి హెల్ప్ చేస్తాయి.
శ్వాసకోశ సంబంధిత సమస్యలకు.. భాంగ్ పానియంలో ఉండే బ్రోంకోడైలేటర్స్ వాయుమార్గాలను తెరిచి శ్వాసకోశ సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు ఉపయోగపడుతుంది.
అన్నింటి కంటే ముఖ్యంగా భాంగ్ పానియం విషయంలో గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఇది ఒక్కొక్కరి శరీరంపై ఒక్కోలా ప్రభావం చూపిస్తుంది. ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది వారి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఎలాంటి వారికైనా సరే.. మోతాదుకు మించి సేవించడం దుష్పరిణామాలకు దారి తీసే ప్రమాదం ఉంటుందనే విషయం మర్చిపోవద్దు. అందుకే ఇది హోలీ పండగ లాంటి ప్రత్యేక సందర్భాల్లో అరుదుగా మాత్రమే సేవిస్తుంటారు.
ఇది కూడా చదవండి : Pineapple Benefits: పడక సుఖం పెంచే పైనాపిల్ పండు తింటే కేకో కేక
ఇది కూడా చదవండి : Bed Room Matters: శృంగారంలో పాల్గొన్న తరువాత మహిళలకు మూత్ర విసర్జన తప్పనిసరా ? ఎందుకు ?
ఇది కూడా చదవండి : Curd For Diabetes Patients: షుగర్ పేషెంట్స్ పెరుగు తినొచ్చా ? తింటే ఏమవుద్ది ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Faceboo