Shreyas Iyer Likey to Miss IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023కి ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్ తగలనుంది. కోల్‌కతా కెప్టెన్, టీమిండియా స్టార్ ప్లేయర్ శ్రేయాస్ అయ్యర్.. వెన్ను గాయం కారణంగా ఐపీఎల్ 2023కి దూరం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆస్ట్రేలియాతో నేడు ముగిసిన నాలుగో టెస్టులో వెన్ను నొప్పితో బాధపడుతున్న అతను బ్యాటింగ్ కూడా చేయలేదు. పదో స్థానంలోనూ అయ్యర్ బ్యాటింగ్‌కు దిగలేదు. అయితే బీసీసీఐ నుంచి ఇప్పటివరకు అయ్యర్ గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
వెన్నులో సమస్య కారణంగా గతంలో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శ్రేయాస్ అయ్యర్ ఆడలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. 2, 3 టెస్టులో అయ్యర్ బ్యాటింగ్ చేశాడు. ఇక 4వ టెస్ట్ మ్యాచ్‌లో 5వ స్థానంలో బ్యాటింగ్ దిగాల్సి ఉంది. అయితే వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టడంతో బ్యాటింగ్‌కు దిగలేదు. టెస్టు జరుగుతున్న క్రమంలోనే అతడిని వైద్య చికిత్సల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అయ్యర్ నడవలేని స్థితిలో ఉన్నాడని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తమ కథనంలో వెల్లడించింది.
వెన్ను గాయం కారణంగా శ్రేయాస్ అయ్యర్ ఇప్పటికే ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ నుంచి తపుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య 17న తొలి వన్డే ముంబైలో జరగనుంది. మార్చి 19న విశాఖపట్నంలో రెండో వన్డే, మార్చి 22న చెన్నైలో మూడో వన్డే జరగనుంది. 2-1తో టెస్టు సిరీస్ భారత్ గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పటికే వన్డే సిరీస్ నుంచి తప్పుకున్న అయ్యర్.. ఐపీఎల్ 2023లో ఆడేది అనుమానంగానే ఉంది. ప్రస్తుతం బీసీసీఐ వైద్యుల పర్యవేక్షణలో ఉన్న అయ్యర్.. వెన్ను గాయానికి శస్త్రచికిత్స అవసరమని సమాచారం తెలుస్తోంది.
శ్రేయాస్ అయ్యర్ వెన్ను గాయానికి శస్త్రచికిత్స జరిగితే.. మూడు నుంచి నాలుగు నెలల పాటు విశ్రాంతి అవసరం ఉంటుంది. దాంతో ఐపీఎల్ 2023 అయ్యర్ ఆడడం కుదరదు. కేకేఆర్ అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. సారథిగా కూడా నియమించింది. 'నాలుగో టెస్టు మూడో రోజు శ్రేయాస్ అయ్యర్ వెన్నెముక కింది భాగంలో నొప్పి ఉందని చెప్పాడు. వెంటనే స్కానింగ్ తీయించాం. బీసీసీఐ వైద్య బృందం అతడి ఆరోగ్య పరిస్థితిని గమనిస్తోంది'అని బీసీసీఐ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
Also Read: Telangana Rain Alert: తెలంగాణకు చల్లటి కబురు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.