Telangana Rain Alert: తెలంగాణకు చల్లటి కబురు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!

Heavy Rains Likely to Hit Telangana for Next 4-5 Days. వేడి తాపానికి అలాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 4-5 రోజుల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందట.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 13, 2023, 08:43 PM IST
  • తెలంగాణకు చల్లటి కబురు
  • ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు
  • గతేడాది కంటే ఈసారి భారీగా ఉష్ణోగ్రతలు
Telangana Rain Alert: తెలంగాణకు చల్లటి కబురు.. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు!

IMD Issues Rain Alert for Telangana: ఈ ఏడాది వేసవికాలం ఆరంభం నుంచే ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 8-9 గంటల నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.  పగటిపూట అయితే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. దాంతో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఇప్పుడే మధ్యాహ్నం వేళల్లో ఎండ దాటికి జనాలు బయటకు ఎక్కువగా రావడం లేదు. గతేడాది కంటే ఈసారి భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని  అంచనా వేస్తున్నారు. వేడి తాపానికి అలాడుతున్న తెలంగాణ ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. వచ్చే 4-5 రోజుల పాటు  ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందట. 

తెలంగాణలో మార్చి 15 నుంచి 18 వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో తూర్పు ఆగ్నేయ గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. బుధ, గురు, శుక్ర వారాల్లో మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్రం తెలిపింది. కొన్నిచోట్ల వడగండ్ల వాన కూడా కురవనున్నట్లు పేర్కొంది. గత కొంతకాలంగా ఎండలతో సతమవుతున్న రాష్ట్ర వాసులకు ఉష్ణోగ్రతల తగ్గుదల కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంది. 

తెలంగాణలోని 18 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, పెద్దపల్లి, సంగారెడ్డి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలు అలర్ట్ జారీ చేసిన జాబితాలో ఉన్నాయి. మార్చి 21 నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయట. 

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఆగ్నేయ, నైరుతి దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ డిపార్ట్మెంట్ పేర్కొంది. రాష్ట్రంలో ఒకటి లేదా రెండు చోట్ల పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రతల కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మార్చి 15, 16 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఢిల్లీలో వేడిగాలులు పెరుగుతున్నాయి. ఆదివారం ఢిల్లీలో గరిష్టంగా 34.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. 

Also Read: King Cobra Man Viral Video: బుసలు కొడుతున్న డేంజరస్ కింగ్ కోబ్రా.. ఒట్టిచేతులతోనే సింపుల్‌గా పట్టేశాడు! గూస్ బంప్స్ పక్కా  

Also Read: Best Mileage SUV 2023: ధర తక్కువ, మైలేజీ ఎక్కువ.. ఈ సూపర్ 5 ఎస్‌యూవీలపై ఓ లుక్కేయండి!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News