Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఇలా మాత్రం అసలు చేయకండి!

Chaitra Navratri 2023 Update: ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటూ ఉంటారు, హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రుల 9 రోజులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదు!

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 14, 2023, 12:50 PM IST
Chaitra Navratri 2023: చైత్ర నవరాత్రి ఉపవాసం చేస్తున్నారా? ఇలా మాత్రం అసలు చేయకండి!

Chaitra Navratri 2023 News: ప్రతి సంవత్సరం చైత్ర నవరాత్రి చైత్ర మాసంలోని శుక్ల పక్షంలో జరుపుకుంటూ ఉంటారు. ముందుగా ఈ నవరాత్రుల మొదటి రోజున కలశాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ సంవత్సరం చైత్ర నవరాత్రులు మార్చి 22 నుండి మార్చి 30 వరకు జరుపుకోనున్నారు. అంటే ఈ ఏడాది మార్చి 22న కలశాన్ని ఏర్పాటు చేస్తారు. 

ఇక ఈ 9 రోజుల పాటు ప్రతిరోజూ దుర్గా దేవికి చెందిన 9 రూపాలు పూజిస్తారు. దుర్గాదేవిని పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు లభిస్తాయి. దుర్గా దేవిని పూజించడం ద్వారా కోరికలు కూడా నెరవేరుతాయని చెబుతారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం, నవరాత్రుల 9 రోజులు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకూడదని చెబుతున్నారు. అవేమిటో చూద్దామా? 

  • చైత్ర నవ రాత్రులలో జుట్టు, గడ్డం మరియు మీసాలు కత్తిరించకూడదు, అలా చేస్తే ఉపవాసం ఫలితం ఇవ్వదని నమ్ముతారు.
  •  అంతేకాక మీరు నవరాత్రి వ్రతాన్ని పాటించినట్లయితే, లెదర్ బెల్టులు, చెప్పులు, బ్యాగులు మొదలైన వాటిని ఉపయోగించకూడదని చెబుతున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో కూడా వాడకూడదు. 
  • నవరాత్రులలో ఉపవాసం ఉండే వారు నిమ్మకాయలు కానీ పనసపండును కోయకూడదని చెబుతున్నారు. 
  • అంతేకాదు నవరాత్రులలో నలుపు రంగు దుస్తులు అస్సలు ధరించరాదు. నవరాత్రులలో ఉపవాసం ఉండేవారు ధాన్యాలు అలాగే ఉప్పు కూడా తినకూడదు. 
  • ఇక ఈ 9 రోజుల ఉపవాసంలో ఉన్నప్పుడు అస్సలు మురికి బట్టలు ధరించకూడదు. 
  • ఇక దుర్గమ్మను తడి బట్టలు ధరించి పూజించాలి. 
  • ఇక ఆ తరువాత తల్లిని పూజించే సమయంలో పొడి బట్టలు ధరించి పూజించాలి. 
  • ఇక ఈ నవరాత్రులలో వెల్లుల్లి-ఉల్లిపాయలు అసలు తీసుకోకూడదు. 
  • నవ రాత్రులలో మాంసం, చేపలు మరియు మద్యం అసలు తీసుకోకూడదు, అలా చేయడం మత విశ్వాసాల ప్రకారం అశుభం. 
  • ఇక నవరాత్రుల తొమ్మిది రోజులు గోళ్లు కత్తిరించకూడదు. అందుకే నవరాత్రి ప్రారంభానికి ముందే గోర్లు కత్తిరించండి. 

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం మొత్తం సాధారణ విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. జీ తెలుగు న్యూస్ దానిని ధృవీకరించలేదు. ఏదైనా సమాచారాన్ని అమలు చేయడానికి ముందు, దయచేసి సంబంధిత నిపుణులను సంప్రదించండి.)

Also Read: Shani Gochar 2023: మార్చి 18 నుండి ఈ 4 రాశులకు ఐశ్వర్యం, అదృష్టం.. ఇందులో మీరున్నారా?

Also Read: Guru Asta 2023: అస్తమించబోతున్న గురుడు.. రాబోయే 74 రోజులపాటు ఈ రాశులకు కష్టాలే కష్టాలు.. ఇందులో మీది ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 
 

Trending News