Taraka Ratna Wife Emotional Viral: నువ్ రియల్ హీరో ఓబు.. ఆ గుండె అన్నీ భరించింది.. తారకరత్న వైఫ్ ఎమోషనల్ పోస్ట్

Alekhya Reddy Emotional Post in Social Media: నందమూరి హీరో తారకరత్న మరణించి నెల పూర్తయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తన ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 19, 2023, 12:33 PM IST
Taraka Ratna Wife Emotional Viral: నువ్ రియల్ హీరో ఓబు.. ఆ గుండె అన్నీ భరించింది.. తారకరత్న వైఫ్ ఎమోషనల్ పోస్ట్

 Taraka Ratna Wife Emotional Post in Social Media: నందమూరి హీరో తారకరత్న మరణించి నెల పూర్తయిన సందర్భంగా ఆయన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో తన ఆవేదన వ్యక్తం చేస్తూ సుదీర్ఘ పోస్ట్ షేర్ చేసుకుంది. అంతేకాక తన భర్త తారకరత్నతో ఆమె కలిసి ఉన్న కొన్ని ఫోటోలను సైతం షేర్ చేసుకుంది. తాము కలిసినప్పటి నుంచి మెమరీస్ గా ఉన్న ఫోటోలను ఆమె కొన్ని షేర్ చేస్తూ వచ్చింది. సరిగ్గా నీవు మమ్మల్ని వదిలేసి నెలరోజులు అయ్యాయి కానీ నీతో ఉన్న జ్ఞాపకాలన్నీ నా మైండ్ లో చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి.

మనం కలిసాం, కలిసిన తర్వాత బెస్ట్ ఫ్రెండ్స్ గా మారాం, తర్వాత డేటింగ్ చేశాం, నేను ఈ రిలేషన్షిప్ గురించి క్లారిటీగా లేకపోయినా నువ్వు మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఒక కొత్త అధ్యాయాన్ని మన జీవితంలో ప్రారంభించబోతున్నామని నమ్మావు. ఆ నిర్ణయం కోసం నువ్వు ఎన్నో యుద్ధాలు చేశావు, మనం పెళ్లి చేసుకున్నాం, పెద్ద గొడవ అయింది మనల్ని వేరుగా చూశారు. కానీ చాలా సంతోషంగానే ఉన్నాం అవన్నీ కేవలం నీ వల్లే సాధ్యమయ్యాయి.


 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alekhya Tarak Ratna (@alekhyarede)

వాటన్నింటినీ దాటుకు రావడం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు. నిష్కమ్మ పుట్టిన తర్వాత మన జీవితాలు మారిపోయాయి, మన సంతోషం రెట్టింపు అయింది కానీ మనం ఇబ్బందులు పడుతూనే ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మనం పోరాడుతూనే ఉన్నాం. 2019లో మనకి ఒక సర్ప్రైజ్ లభించింది, అవును మన జీవితంలోకి కవలలు వచ్చారు. నీ కుటుంబాన్ని నువ్వు మిస్ అయ్యి కుటుంబం కోసం ఎంత పరితపించావో నాకు మాత్రమే తెలుసు. వారితో మనం కలిసి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాం. నువ్వు చనిపోయే వరకు పోరాడుతూనే ఉన్నావు, నీ గుండెల్లో ఉన్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు.

మన అనుకున్న వాళ్లే మనల్ని బాధ పెడితే అది ఎలా ఉంటుందో నువ్వు అనుభవించావు. నువ్వు అనుభవించిన బాధ విషయంలో నేనేమీ చేయలేకపోయాను. మొదటి నుండి మనకి అండగా నిలిచిన వ్యక్తులు మాత్రమే చివరి వరకు ఉన్నారు. కానీ నేను కోల్పోయిన నువ్వు చాలా దూరం వెళ్ళిపోయావు, మీ సమాధిపై కూడా మిమ్మల్ని చూడలేకపోతున్నాం. మీరు మా రియల్ హీరో ఓబు, కుటుంబంగా మేము మీ గురించి గర్విస్తున్నాము, ఈ తక్కువ వ్యవధిలో కూడా మీతో ఈ ప్రయాణాన్ని కలిగి ఉన్నందుకు గర్విస్తున్నాను అంటూ ఆమె రాసుకొచ్చింది.

Also Read: Allu Arjun Blocked: తన హీరోయిన్ ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. బయటపెట్టి గగ్గోలు.. అసలు విషయం ఏంటంటే?

Also Read: Payal Ghosh on Jr.NTR: సౌత్లో ఆ డైరెక్టర్లతో పని చేశా..మూడో మీటింగ్లోనే రేప్.. ఎన్టీఆర్ పేరు లాగుతూ హీరోయిన్ సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x