Jupiter Transit 2023: గ్రహాలకు అధిపతి అయిన బృహస్పతి ఏప్రిల్ 22న మీనరాశిని వదిలి మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. అయితే ఛాయా గ్రహం, దుష్ట గ్రహమైన రాహువు అప్పటికే అదే రాశిలో తిష్ట వేసి ఉంటాడు. రాహువు మేషంలో అక్టోబరు 30 వరకు ఉంటాడు. ఈ రెండు గ్రహాలు దాదాపు 6 నెలలపాటు కలిసి ఉంటాయి. ఈ రెండు గ్రహాల కలయిక వల్ల గురు-చండాల యోగం ఏర్పడుతోంది. ఈ యోగం ఎవరి జాతకంలో ఏర్పడుతుందో వారు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ముఖ్యంగా వీరు వచ్చే ఆరు మాసాలపాటు జాగ్రత్తగా ఉండాలి. ఆ దురుదృష్ట రాశులేంటో తెలుసుకుందాం.
మేష రాశి
ఏప్రిల్ 22 తర్వాత ఈ రాశికి చెందిన లగ్న గృహంలో గురు చండాల యోగం ఏర్పడుతుంది. దీంతో మీకు అక్టోబరు 30 వరకు కష్టాలే ఉంటాయి. ఆర్థికంగా మీ పరిస్థితి దిగజారవచ్చు. మీ ఫేమ్ పడిపోతుంది. ఆరోగ్యం చెడిపోయే అవకాశం ఉంది.
మిధునరాశి
గురు చండాల యోగం కారణంగా మిథునరాశి వారు కొన్ని చెడు వార్తలు వినే అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు అనేక సమస్యలను ఎదుర్కోంటారు. ఆఫీసులో కూడా మీకు అనుకూలంగా ఉండదు. మెుత్తానికి ఈ సమయం మీకు అస్సలు కలిసిరాదు.
ధనుస్సు రాశి
గురు చండాల యోగం వల్ల ధనుస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవింగ్ చేసేటప్పుడు కేర్ పుల్ గా ఉండాలి. అనవసరంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. మీ కెరీర్ లో ఆటంకాలు ఎదురవుతాయి.
కర్కాటకం
గురు చండాల యోగం కారణంగా మీకు ఆఫీసులో సహచరులు లేదా బాస్ తో విభేదాలు రావచ్చు. మీకు శత్రువుల ముప్పు పొంచి ఉంది. ఈ సమయంలో ఆచితూచి మాట్లాడండి.
పరిహారం
ఎవరి జాతకంలో గురు-చండాల యోగం ఏర్పడుతుందో వారు గురువారం నాడు శ్రీమహావిష్ణువును పూజించాలి.
Also Read: Surya Budh yuti 2023: మార్చి 31 వరకు ఈ మూడు రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK