Pay Online Using UPI without Internet: ఈరోజుల్లో డిజిటల్ చెల్లింపులు చేస్తున్న ట్రెండ్ చాలా పెరిగింది. ఎందుకంటే ఇలా ఆన్ లైన్ లో పే చేయడం సౌకర్యవంతంగా ఉంటుంది. డబ్బులు క్యారీ చేయకుండానే ఎలాంటి పర్సులు, కార్డులు జేబులో పెట్టుకోకుండానే త్వరగా డబ్బులు కావలసిన వారికి బదిలీ చేస్తుంది. Google Pay, PhonePe, Paytm వంటి (UPI) ఆధారిత డిజిటల్ పేమెంట్స్ చేయడానికి మీకు ఇంటర్నెట్ కనెక్టివిటీ అవసరం. అలాంటి డిజిటల్ పేమెంట్స్ ఇంటర్నెట్ లేకుండా చెల్లించలేము.
అయితే, ఇంటర్నెట్ లేదా మొబైల్ డేటా లేకుండా కూడా మీరు చెల్లింపులు చేయగల ఒక పద్ధతి ఉంది. అది ఎలా ఏమిటి? అనే వివరాలు మీకోసం.
ఫోన్ నుండి ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపు చేయడానికి, మీరు *99# కోడ్‌ని ఉపయోగించాలి.
దీనిని USSD సేవ అని కూడా అంటారని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒకప్పుడు మనం బ్యాలెన్స్ ఇలాగే చెక్ చేసుకునే వాళ్ళం కదా. . మీరు *99# సేవను ఉపయోగించడం ద్వారా అన్ని UPI సేవల ప్రయోజనాలు పొందవచ్చు.
స్మార్ట్ఫోన్లను ఉపయోగించే వారు ఇంటర్నెట్ సేవ అందుబాటులో లేనప్పుడు *99# అంటే USSD అత్యవసర సౌకర్యాన్ని తీసుకోవచ్చు
ఇలా చెక్ చేయండి:
- స్మార్ట్‌ఫోన్‌లో డయల్ బటన్‌ను తెరిచి *99# అని టైప్ చేసి, ఆపై కాల్ బటన్‌ను టచ్ చేయండి.
- పాప్అప్ మెనూలో మీకు ఒక మెసేజ్ వస్తుంది.
- అందులో 7 కొత్త ఆప్షన్లు వస్తాయి. వాటిలో
- 1 నంబర్‌ను ట్యాప్ చేయడం ద్వారా మనీ పంపండి అనే ఆప్షన్ వస్తుంది.
- దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
- ఆ తరువాత పేమెంట్ చేయాల్సిన వ్యక్తి నంబర్ని టైప్ చేసి, సెండ్ మనీ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- యూపీఐ అకౌంట్ కు లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, సెండ్ మనీపై నొక్కండి.
- మీరు ఎంత పంపాలనుకుంటున్నారు అనేది సంఖ్యా రూపంలో వ్రాసి, ఆపై సెండ్ మనీ ప్రెస్ చేయండి.
- అక్కడి పాప్అప్లో, మీరు ఎందుకు చెల్లింపు చేస్తున్నారో కారణాన్ని వ్రాయాలి, ఆపై అద్దె, రుణం లేదా షాపింగ్ బిల్లు మొదలైన దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి.
- ఇంటర్నెట్ లేకుండా UPI చెల్లింపు కోసం గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే ముందుగా మీ నంబర్ UPIతో రిజిస్టర్ చేయబడి ఉండాలి. అలాగే అదే నంబర్ మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడాలి. అదే నంబర్‌తో మీరు *99# సేవలను ఉపయోగించవచ్చు. మీరు ఈ *99# ussd కోడ్ ఉపయోగించి ఏదైనా UPI సేవలను ఉపయోగించవచ్చు.
Also Read: Patna Obscene Video: కొంపముంచిన కక్కుర్తి.. పోర్న్ చూస్తూ రైల్వేస్టేషన్లో అందరికీ చూపించేశాడు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook