రుతుపవనాలు తీసుకొచ్చిన భారీ వర్షాలు దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలకు కారణమైతే, ఇంకొన్ని చోట్ల ఎండా కాలం మిగిల్చిన వేసవి తాపం నుంచి ఇప్పుడిప్పుడే ఉపశమనం ఇస్తున్నాయి. అయితే, ఇదే వర్షాలు కొన్ని లేనిపోని వ్యాధులను కూడా మోసుకొచ్చే ప్రమాదం ఉండటంతో గుజరాత్‌లోని వదోదర మునిసిపాలిటీ ఆ నగరంలో పానీ పూరి అమ్మకాలను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. వర్షాకాలంలో ప్రబలే వ్యాధుల ప్రభావం కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదని భావిస్తూ వదోదర మునిసిపాలిటీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కాలంలో వదోదరలో వాంతులు, విరోచనాలతో చాలామంది ఆస్పత్రులపాలయ్యారు. ఇటువంటి వ్యాధులకు వీధుల్లో విక్రయించే నాణ్యత లేని చిరుతిండే కారణం అని భావించిన మునిసిపాలిటీ విభాగం అధికారులు.. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా వదోదరలో పానీ పూరి అమ్మకాలపై నిషేధం విధించారు.
VMC Food Dept has conducted surprise checking to 50 manufacturing units in Vadodara . Destroyed 4000 kgs of puri, 3350 kgs of potatoes and chana, 1200 ltrs of panipuri nu pani, VMC has decided not to sale pani puri until diarrhoea and vomiting cases was declined. pic.twitter.com/3AZT8d44GZ
— VMC VADODARA (@VMCVadodara) July 27, 2018
Sale of Golgappa has been banned in Vadodara till the time monsoon ends. VMC official says, 'many cases of diarrhoea & vomiting have been reported in past few days. 8 teams of the food safety department have been deployed for this task. This for the welfare of people' #Gujarat pic.twitter.com/QuTeDqWSEU
— ANI (@ANI) July 28, 2018
ఇదిలావుంటే, వదోదర మునిసిపాలిటీ అధికారులు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు కల్తీ ఆహారం తీసుకుని అనారోగ్యం బారిన పడకుండా అధికారులు మంచి నిర్ణయం తీసుకున్నారని కొంతమంది అభినందిస్తుంటే, పానీ పూరి ప్రియులు మాత్రం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.