Currency News: ప్రజలకు గుడ్‌న్యూస్.. తెరపైకి మళ్లీ రూ.1000 నోటు

Currency Notes Latest Update: పాత పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడిన విషయం తెలిసిందే. పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేయడంతో తమ దగ్గర ఉన్న నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల చూట్టు క్యూ కట్టారు. రద్దైన రూ.1000 నోటును మళ్లీ పునరద్దిస్తారనే ప్రచారం జరుగుతోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 30, 2023, 10:04 PM IST
Currency News: ప్రజలకు గుడ్‌న్యూస్.. తెరపైకి మళ్లీ రూ.1000 నోటు

Currency Notes Latest Update: కేంద్ర ప్రభుత్వం 2016లో పాత పెద్ద నోట్లను రద్దు చేయడం ఒక్కసారిగా దేశాన్ని కుదిపేసింది. పాత రూ.500, రూ.1000 వెయ్యి నోట్లను రద్దు చేసి.. వీటిస్థానంలో కొత్త రూ.500, రూ.2 వేల నోట్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం రూ.2 వేల నోటు కనుమరుగవుతున్న తరుణంలో మళ్లీ రూ.1000 నోట్లు అందుబాటులోకి వస్తాయనే ప్రచారం ఊపందుకుంది.  కేంద్ర ప్రభుత్వం మళ్లీ ఈ నోట్‌ను ప్రారంభించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దేశంలో నల్లడబ్బును అరికట్టేందుకు నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే బడా బాబుల వద్ద ఉన్న బ్లాక్ మనీ బయటకు వచ్చిన దాఖాలాలు ఎక్కడ కనిపించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మరోసారి 1000 రూపాయల నోటును ప్రారంభిస్తే.. ప్రజలకు గుడ్‌న్యూస్ అని చెప్పొచ్చు.  

నోట్ల రద్దు సమయంలో ప్రజలు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంక్‌ల ముందు క్యూలు కట్టి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగదు విత్ డ్రా చేసుకునేందుకు ఏటీఎంల ముందు నిల్చొని.. నిల్చొని అలసిపోయారు. ఆ తరువాత దేశంలో డిజిటల్ పేమెంట్స్‌కు అలవాటు పడ్డారు. 

ప్రస్తుతం రూ.2 వేల నోటు చలామణిలో కనిపించడంలేదు. ఆర్‌బీఐ వార్షిక నివేదిక ప్రకారం.. గతేడాది మార్చి 31 నాటికి మొత్తం 214.20 కోట్ల రూపాయల 2 వేల నోట్లు  చెలామణిలో ఉన్నాయి. ఇది మొత్తం నోట్లలో 1.6 శాతం. మొత్తం రూ.4,28,394 కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నాయి. విలువ పరంగా 13.8 శాతం నోట్లు ఉన్నాయి. 

2016లో నవంబర్ 8న ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో పెద్ద నోట్ల రద్దును ప్రకటించారు. ఆ తరువాత అదేరోజు అర్ధరాత్రి నుంచి దేశంలో 500, 1000 రూపాయల కరెన్సీని నిషేధించారు. అయితే ఆ తరువాత ప్రజలు బ్యాంకు నుంచి పాత నోట్లను మార్చుకోవడానికి అనుమతించారు. ప్రస్తుతం రూ.1000 నోటు పునరుద్దరిస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read: IPL 2023: ఐపీఎల్‌లో అత్యధికంగా సంపాదించిన టాప్-5 ఆటగాళ్లు వీళ్లే..!  

Also Read: Coronavirus Cases Today: కరోనా అలర్ట్.. నేడు భారీగా కేసులు నమోదు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook 

Trending News