Get Rid Of White Hair Black: ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలు రావడం సర్వసాధరణంగా మారాయి. చాలా మందిలో తెల్ల జుట్టు, జుట్టు రాలడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తీసుకునే ఆహారాలపై కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితె పలు ఇంటి నివారణలు పాటించడం వల్ల కూడా సులభంగా తెల్ల జుట్టును వదిలించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఎలాంటి చిట్కాలను పాటించి జుట్టు సమస్యల నుంచి ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ చిట్కాలు తప్పని సరి:
హెన్నా పౌడర్:
రెండు టీస్పూన్ల హెన్నా పౌడర్, ఉసిరి పొడి, షికాకాయ్, ఒక టీస్పూన్ నిమ్మరసం, రెండు టీస్పూన్ల పెరుగు, ఒక గుడ్డు, అర టీస్పూన్ కొబ్బరి నూనెను మిక్స్ చేసి మిశ్రంగా తయారు చేయాలి. ఇలా చేసిన పేస్ట్‌ను జుట్టుకు పట్టిస్తే సులభంగా తెల్ల జుట్టు సమస్యల నుంచి ఉపశమసం లభిస్తుంది. అంతేకాకుండా జుట్టు దృఢంగా కూడా తయారవుతుంది. కాబట్టి జుట్టు రాలడం ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మిశ్రమాన్ని వినియోగించాల్సి ఉంటుంది.
నిమ్మకాయ:
ఉసిరి పొడిలో నిమ్మరసం మిక్స్ చేసి రోజూ జుట్టుకు అప్లై చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 30 నుంచి 40 నిమిషాల తర్వత జుట్టును శుభ్రం చేసుకుంటే జుట్టు దృఢంగా నల్లగా తయారవుతుంది. వేగంగా రాలుతున్న జుట్టు తగ్గిస్తుంది.
నువ్వులు:
నువ్వులు తినడం వల్ల కూడా జుట్టు సమస్యల తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు తెలుపుతున్నారు. నువ్వుల నూనెను జుట్టు అప్లై చేయడం వల్ల కూడా సులభంగా జుట్టు రాలడం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
భృంగరాజ్:
బృంగరాజ్, అశ్వగంధ మూలికలు జుట్టును ఒత్తుగా దృఢంగా తయారు చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే గుణాలు తెల్ల జుట్టు నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తుంది. కాబట్టి తెల్ల జుట్టు, ఇతర సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ఈ మూలికలను వినియోగించాల్సి ఉంటుంది.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు, సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: Honey Rose Pics : బాప్ రే అనిపించేలా హనీ రోజ్ భారీ అందాలు.. కత్తుల్లాంటి చూపుల్తో కిక్కిస్తోన్న భామ
Also Read: Nithiin Fans : ఫ్లాప్ డైరెక్టర్‌తో నితిన్ సినిమా.. హర్ట్ అయిన అభిమాని.. హీరో రిప్లై ఇదే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook