ప్రియుడిని కట్టేసి నిప్పంటించిన ప్రియురాలు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!

ప్రాణం తీసిన వివాహేతర సంబంధం

Last Updated : Jul 30, 2018, 08:20 PM IST
ప్రియుడిని కట్టేసి నిప్పంటించిన ప్రియురాలు.. ప్రాణం తీసిన వివాహేతర సంబంధం!

ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువతి ఆర్థిక లావాదేవీల కారణంగా తలెత్తిన వివాదంతో అతడిని కిరాతకంగా హత్యచేసిన ఘటన ప్రకాశం జిల్లాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని పొదిలికి చెందిన షేక్ షబ్బీర్ (32)కి గతంలోనే వివాహం కాగా పెళ్లైన మరో స్థానిక యువతి షకీరా (28)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. వీళ్లిద్దరూ కలిసి చౌటపల్లిలో కోళ్ల ఫారమ్ వ్యాపారం సైతం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య లావాదేవీలు తలెత్తడంతో ఇరువురి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 

ఇదిలావుండగానే శనివారం రాత్రి ఎప్పటిలాగే షకీరాతో గడిపేందుకు చౌటపల్లిలోని కోళ్లఫారంకు వచ్చాడు షబ్బీర్. షబ్బీర్‌తో తరచుగా బాండేజ్ సెక్స్ (చేతులు, కాళ్లు కట్టేసుకుని శృంగారంలో పాల్గొనడం)లో పాల్గొనే షకీరా యధావిధిగానే గొలుసుతో మంచానికి అతడి చేతులు, కాళ్లు కట్టేసింది. అనంతరం అతడిపై కిరోసిన్ పోసి నిప్పంటించి హత్య చేసింది. షబ్బీర్‌ని హత్య చేసిన షకీరా అనంతరం పోలీసుల విచారణలో నిజం అంగీకరించి పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు సమాచారం. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కేసుని దర్యాప్తు చేస్తున్నారు. 

Trending News