IPL Records: ఐపీఎల్ 2023లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ కోసం ఆరు రికార్డులు నిరీక్షిస్తున్నాయి. ఈ ఆరు రికార్డుల్ని ఈ సీజన్లో అతను చేరుకుంటాడా లేదా అనేది అతడి ఆటతీరును బట్టి ఆధారపడి ఉంటుంది. గరిష్టంగా ఆరు రికార్డులు, కనీసం 2 రికార్డులు చేరుకునే అవకాశాలున్నాయి..
ఐపీఎల్ 2023 సీజన్ 16లో ఆరవ టైటిల్ కోసం రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ బరిలో ఉంది. గత సీజన్లో పేలవ ప్రదర్శనతో ముందే వెనుదిరిగిన రోహిత్ సేన ఈసారి టైటిల్ సాధించాలనే కసితో ఉంది. అదే సమయంలో ఈ ఐపీఎల్ 2023లో హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రాణిస్తే..6 రికార్డులు సిద్ధంగా ఉన్నాయి. రోహిత్ శర్మ కోసం సిద్ధంగా ఉన్న ఆరు రికార్డుల్లో సాధ్యాసాధ్యాలేంటో తెలుసుకుందాం..
100 క్యాచ్‌లు
రోహిత్ శర్మ బ్యాటర్, కెప్టెన్‌గానే కాకుండా ఫీల్డర్ కూడా. ఇప్పటి వరకూ 15 సీజన్లలో 97 క్యాచ్‌లు పట్టాడు. ఇంకో మూడు పడితే 100 క్యాచ్‌ల క్లబ్లో చేరతాడు. ఈ ఫీట్‌ను ఇప్పటి వరకూ సురేశ్ రైనా 109 క్యాచ్‌లు, కీరన్ పోలార్డ్ 103 క్యాచ్‌లు సాధించారు. రోహిత్ తరువాత కోహ్లీ 93 క్యాచ్‌లు, శిఖర్ ధావన్ 92 క్యాచ్‌లు తీసుకున్నారు. ఈ ఐపీఎల్లో రోహిత్ సాధించగలిగే ఫీట్ ఇది.
టీ20లో 11000 పరుగులు
టీ20 క్రికెట్లో రోహిత్ శర్మ ఇప్పటి వరకూ 407 మ్యాచ్‌లు ఆడి 31 యావరేజ్‌తో 133.55 స్ట్రైక్ రేట్‌తో 10,703 పరుగులు చేశాడు. మరో 297 పరుగులు సాధిస్తే 11,000 పరుగుల ఫీట్ సాధిస్తాడు. ఈ ఫీట్‌ను ఇప్పటి వరకూ క్రిస్ గేల్ 14,562, కీరన్ పోలార్డ్ 12,528, షోయబ్ మాలిక్ 12,175, ఆరోన్ పింఛ్ 11,392, డేవిడ్ వార్నర్ 11,179 సాధించారు. ఈ సీజన్లో ఈ ఫీట్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. రోహిత్ 4-5 మ్యాచ్‌లలో రాణిస్తే చాలు. ఈ ఫీట్ అందుకోగలడు.
6000 పరుగులు
రోహిత్ శర్మ ఐపీఎల్లో 6000 పరుగులు చేరుకునేందుకు మరో 121 పరుగుల అవసరమౌతాయి. ఇప్పటి వరకూ ఈ ఫీట్‌ను అంటే 15 ఐపీఎల్ సీజన్లలో విరాట్ కోహ్లీ 6,624 పరుగులు, శిఖర్ ధావన్ 6,244 పరుగులు సాధించారు. రోహిత్ ఇప్పటి వరకూ ఐపీఎల్లో 5,879 పరుగులు సాధించగా డేవిడ్ వార్నర్ 5,881 పరుగులతో ఈ రికార్డుపై కన్నేశాడు. రోహిత్ లేదా డేవిడ్ ఎవరు ఈ ఫీట్ సాధిస్తారో చూడాలి.
ఒకే ఫ్రాంచైజీలో 5000 పరుగులు
2011లో ముంబై ఇండియన్స్‌లో చేరినప్పటి నుంచి రోహిత్ శర్మ ఇదే ఫ్రాంచైజ్ తరపున 182 మ్యాచ్‌లు ఆడి 4,709 పరుగులు సాధించాడు. ఇంకో 291 పరుగులు పూర్తి చేస్తే ఒకే ఫ్రాంచైజీ తరపున 5000 పరుగులు చేసిన ఏకైక ఆటగాడు అవుతాడు. ఐపీఎల్ ప్రారంభంలో రోహిత్ శర్మ దెక్కన్ ఛార్జర్స్ తరపున మూడు సీజన్లు ఆడాడు.
ఐపీఎల్ 6వ టైటిల్
రోహిత్ నేతృత్వంలో ముంబై ఇండియన్స్ ఇప్పటి వరకూ 2013, 2015, 2017, 2019, 2020 టైటిల్స్ సాధించింది. ఐపీఎల్ 2023 సాధిస్తే ఆరవ టైటిల్ సాధించిన ఘనత దక్కుతుంది. రోహిత్ శర్మ తరువాత ఎంఎస్ ధోని చెన్నై సూపర్‌కింగ్స్ తరపున 4 టైటిల్స్ సాధించాడు. సమిష్టిగా కృషి చేస్తే పటిష్టంగా ఉన్న ముంబై ఇండియన్స్ జట్టుకు ఇది అసాధ్యం కాదు.
కెప్టెన్‌గా 150 ఐపీఎల్ మ్యాచ్‌లు
ఈ సీజన్లో రోహిత్ శర్మ కచ్చితంగా సాధించగలిగే ఫీట్ ఇది. ఇప్పటి వరకూ 143 ఐపీఎల్ మ్యాచ్‌లకు కెప్టెన్సీ వహించాడు. మరో ఏడు మ్యాచ్‌లు పూర్తయితే 150 అవుతుంది. మహేంద్ర సింగ్ ధోని ఒక్కడే ఇప్పటి వరకూ 210 ఐపీఎల్ మ్యాచ్‌లకు సారధ్యం వహించాడు.
Also read: SRH Vs RR: తొలి పోరుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ రెడీ.. రాజస్థాన్‌తో ఢీ.. తుది జట్లు ఇవే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook