దేశంలో ఇంజనీరింగ్, సాంకేతిక విద్య అందిస్తున్న కళాశాలల్లో మొత్తం 277 నకిలీ ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నట్టు కేంద్రం స్పష్టంచేసింది. ఇంజనీరింగ్ కాలేజీల గురించి స్పందిస్తూ లోక్సభకు వివరణ ఇచ్చే క్రమంలో కేంద్రం ఈ సమాచారాన్ని వెల్లడించింది. 277 నకిలీ కాలేజీల్లో ఢిల్లీలో అత్యధికంగా 66 కాలేజీలు ఉండగా ఆ తర్వాతి స్థానంలో తెలంగాణలో 35 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 27 నకిలీ కాలేజీలతో పశ్చిమ బెంగాల్ 3వ స్థానంలో నిలిచింది. నాలుగో స్థానంలో కర్ణాటక (23 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు), ఐదో స్థానంలో ఉత్తర్ ప్రదేశ్ (22 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు) ఆరో స్థానంలో హర్యానా (18), ఏడో స్థానంలో బీహార్ (17), ఎనిమిదవ స్థానంలో మహారాష్ట్ర (16) ఉన్నాయి. ఇక 9వ స్థానంలో తమిళనాడు (11 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు), 10వ స్థానంలో గుజరాత్(8 కాలేజీలు), 11వ స్థానంలో ఆంధ్రప్రదేశ్, చండీఘడ్ (7 నకిలీ ఇంజనీరింగ్ కాలేజీలు) ఉన్నట్టు కేంద్రం లోక్సభకు తెలిపింది.
ఏఐడీఎంకే ఎంపీ పి నాగరాజన్, బీజేపీ ఎంపీలు లక్ష్మణ్ గిలువ, రమాదేవి అడిగన ప్రశ్నకు సమాధానంగా మానవ వనరుల అభివృద్ధి శాఖ సహాయ మంత్రి సత్యపాల్ సింగ్ ఈ వివరాలను లోక్సభకు అందించారు.