Ajwain Leaves Relief Body Pains in 2 Minutes: ప్రతి వంటకంలో భారతీయులు వామును వినియోగిస్తారు. ఎందుకంటే ఇది నోటికి రుచిని అందించడమేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని వాడడం వల్ల పొట్ట సంబంధిత సమస్యలు కూడా సులభంగా దూరమవుతాయి. కాబట్టి దీనిని ఆహారంలో వినియోగించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వామే కాకుండా దీని ఆకులు కూడా అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులను వినియోగించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
వాము ఆకుల ప్రయోజనాలు:
అజ్వైన్ ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు, అనేక విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి.
1. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది:
వాము ఆకుల్లో క్రిమినాశక లక్షణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి దీనిని వినియోగించడం వల్ల దగ్గు, జలుబు, ఆస్తమా వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స కోసం వినియోగిస్తారు. అయితే ఈ ఆకులను మెత్తగా రుబ్బుకుని..వాసనను పీల్చడం వల్ల శ్వాసనాళాలు క్లియర్ అవుతాయి.
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
2. జీర్ణక్రియ వ్యవస్థకు సహాయపడుతుంది:
గ్యాస్, ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణక్రియ సంబంధించిన సమస్యలతో బాధపడేవారు తప్పకుండా వాము ఆకులను వినియోగించాల్సి ఉంటుంది. ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఆకులను నమిలి తినడం వల్ల సులభంగా మీరు మంచి ఫలితాలు పొందుతారు.
3. నొప్పిల నుంచి ఉపశమనం లభిస్తుంది:
అజ్వైన్ ఆకుల్లో అనాల్జేసిక్ లక్షణాలను అధిక పరిమాణంలో లభిస్తాయి. తలనొప్పి, ఇతర శరీర నొప్పుల నుంచి ఉపశమనం కలిగించడానికి ప్రభావవంతంగా సహాయపడుతుంది. కాబట్టి ఈ ఆకులను మిశ్రమంలా తయారు చేసుకుని ప్రభావిత ప్రాంతాల్లో అప్లై చేస్తే సులభంగా మంచి ఫలితాలు పొందుతారు.
(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)
Also Read: White Hair Solution: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతన్నారా? ఈ మాస్క్‌తో మెరిసేలా, మృదువుగా మారుతుంది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook