టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంగ్లీష్ గడ్డపై సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్టులో వండర్ ఫుల్ సెంచరీ నమోదు చేశాడు. టెస్టు కెరీర్లో కోహ్లీకి ఇది 22వ సెంచరీ కాగా..కెప్టెన్గా 15వ టెస్టు సెంచరీ . కెప్టెన్గా అత్యధిగా సెంచరీలు చేసిన జాబితాలో సౌతాఫ్రికా కెప్టెన్ గ్రేమ్ స్మిత్ 25 సెంచరీతో టాప్ ప్లేస్ గా ఉండగా ఆసీస్ మాజీ కెప్టెన్ 19 సెంచరీతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానం కోహ్లీదే (15 టెస్టు సెంచరీలు) కావడం గమనార్హం.
అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ ఇప్పటి వరకు నమోదు చేసిన శతకాల సంఖ్య 57కు చేరింది. కోహ్లీ జోరు ఇలాగే కొనసాగితే సచిన్ 100 శతకాల రికార్డు బ్రేక్ చేస్తాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇంగ్లండ్ పై 1000 పరుగులు చేసిన టీమిండియా బ్యాట్స్మెన్ల జాబితాలో కోహ్లీ కూడా చేరాడు. గతంలో సచిన్, గవాస్కర్, అజారుద్దీన్, పుజరా మాత్రమే టెస్టుల్లో ఇంగ్లండ్ పై వెయ్యి పరుగులు సాధించారు. తాజాగా ఈ జాబితాలో కోహ్లీ కూడా చేరడం విశేషం.