Google Pay Free Services from Toaday: దేశంలో ప్రధానంగా గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వినియోగం అత్యధికం. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఈ యాప్స్ రివార్డ్స్, క్యాష్ బ్యాక్, వోచర్లు వంటివి ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు గూగూల్ పే ఆ సేవల్ని ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. ఇతర యాప్స్‌తో పోటీలో భాగంగా ఈ ఆఫర్ అందిస్తోంది.
గూగుల్ పే ప్రకటించిన ఆఫర్ వినియోగదారులకు ఉపయోగపడేదే. అది సిబిల్ స్కోర్ సేవలు. చాలా సంస్థలు సిబిల్ స్కోర్ సేవలు అందించేందుకు కనీస రుసుము వసూలు చేస్తుంటాయి. గూగుల్ పే ఇప్పుడు తన కస్టమర్లకు ఉచితంగా సిబిల్ స్కోర్ సేవలు అందిస్తోంది.
సిబిల్ స్కోర్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ అని అర్ధం. ఇది ఆర్బీఐ ఆధీకృత క్రెడిట్ ఏజెన్సీ. వ్యక్తుల రుణాలు, చెల్లింపులు, క్రెడిట్ కార్డుల వ్యవహారాన్ని సేకరించి సంబంధిత వ్యక్తుల లావాదేవీలను బట్టి నివేదిక ఇస్తుంటుంది. బ్యాంకులు, వివిధ ఆర్దిక సంస్థల రుణాలు, తిరిగి చెల్లించే పద్ధతిని బట్టి హిస్టరీ, స్కోర్ నిర్ణయిస్తుంది. అంటే ఆ వ్యక్తి తీసుకున్న రుణాలు, సకాలంలో చెల్లిస్తున్నాడా లేడా, ఎన్ని రుణాలున్నాయనే వివరాలు ఇందులో కూలంకషంగా ఉంటాయి. రుణాలు, చెల్లింపులకు సంబంధించిన ట్రాక్ రికార్డు ఇది. సాధారణంగా సిబిల్ స్కోర్ అనేది 300-900 మధ్య ఉంటుంది. 600 కంటే తక్కువ ఉంటే బ్యాంకులు రుణాలు తిరస్కరిస్తాయి.
అదే సిబిల్ స్కోర్ 750 దాటితే మంచి స్కోర్‌గా పరిగణిస్తారు. ఈ వ్యక్తులకు వారి వారి ఆదాయాన్ని బట్టి లోన్ మంజూరు చేయడం చేస్తుంటుంది. సిబిల్ స్కోర్ అనేది ఇటీవలి కాలంలో తప్పనిసరిగా అవసరమైనది. సిబిల్ స్కోర్ ను బట్టే బ్యాంకులు రుణాలిచ్చేది లేనిదీ తెలిసిపోతుంది. అందుకే గూగుల్ పే ఈ సేవల్ని ఉచితంగా అందించడం మంచి పరిణామం. కోట్లాది వినియోగదారులున్న డిజిటల్ పేమెంట్ యాప్..వివిధ రకాల సేవలు అందిస్తూ వస్తోంది. ఇప్పుడు కొత్తగా సిబిల్ స్కోర్ సేవల్ని ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైంది.
Also Read; DA Hike Latest Update: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త, ఏప్రిల్ జీతంతో 1.20 లక్షలు మీ ఎక్కౌంట్లో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook