These 4 zodiac signs will get Money bags due to Ketu Gochar 2023: వేద జ్యోతిషశాస్త్రంలో రాహువు మరియు కేతువులను పాప గ్రహాలుగా పరిగణిస్తారు. అంతేకాదు వాటిని ఛాయా గ్రహాలుగా కూడా పరిగణిస్తారు. అందులకే ప్రజలు ఈ రెండు గ్రహాల ప్రతికూల ప్రభావాలకు భయపడతారు. ఈ గ్రహాల చెడు ప్రభావాలను నివారించడానికి రకాల పూజలు, పరిహారాలు చేస్తారు. అయితే రాహు-కేతువులు అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా.. శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. ఒక వ్యక్తి యొక్క జాతకంలో రాహు-కేతువు గ్రహాలు అశుభ స్థానంలో ఉన్నప్పుడు చెడు ఫలితాలు ఉంటాయి. బలమైన స్థితిలో ఉన్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాయి. దాంతో అదృష్టవంతుడు అవుతాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కేతువు 2023 అక్టోబర్ 30న సంచరించబోతున్నాడు. తులా రాశిలోకి కేతువు ప్రవేశిస్తాడు. కేతువు సంచరించిన వెంటనే కొన్ని రాశుల వారు అదృష్టవంతులు అవుతారు. ఈ వ్యక్తులు అపారమైన విజయాన్ని పొందుతారు. అంతేకాదు జీవితం ఆనందం, శ్రేయస్సుతో విరాజిల్లుతుంది.
మకర రాశి:
కేతువు సంచారం వల్ల మకర రాశి వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ సమయంలో బాగా సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు. వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు.
వృషభం:
వృషభ రాశి వారికి కేతువు సంచారం శుభవార్త తెస్తుంది. ఈ రాశి వ్యక్తులు కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు. మానసిక ఒత్తిడి, బాధల నుంచి బయటపడగలుగుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనలాభం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి.
ధనుస్సు రాశి:
తులా రాశిలో కేతువు సంచరించిన వెంటనే ధనుస్సు రాశి వారికి మంచి రోజులు మొదలవుతాయి. ఈ సమయంలో చాలా లాభం ఉంటుంది. కెరీర్ పరంగా గొప్ప విజయం సాధించవచ్చు. వ్యాపారస్తులు లాభాలు పొందుతారు.
సింహ రాశి:
అక్టోబర్‌లో కేతువు సంచరించిన వెంటనే సింహ రాశి వారు అదృష్టవంతులవుతారు. మీరు కష్టపడి పని చేస్తే.. ఫలితాలు అందుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో ఆస్తిలో పెట్టుబడి పెట్టడం లాభదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగవుతాయి.
Also Read: Earth Breathing Video: మనిషిలానే ఊపిరి పీలుస్తున్న భూమి.. నెట్టింట్లో వైరల్ అవుతున్న క్రేజీ వీడియో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.