NRI News Kuwait: భారత ఇంజినీర్ల కు NOC రద్దు

భారత ఇంజినీర్ల ( Indian Engineer ) కోసం కువైట్ ప్రభుత్వం ( Kuwait Govt ) NOC రద్దు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం.. నకిలీ డాక్యుమెంట్స్ వినియోగించి వర్క్ పర్మిట్ సాధించిన కేసులు ఈ మధ్యా చాలా నమోదు అయ్యాయి.

Last Updated : Aug 15, 2020, 09:06 PM IST
    1. తగిన స్టాండర్ట్ లేని వారిని ఇంజినీర్లుగా గుర్తించడానికి నిరాకరించిన కొంత మంది భారతీయులు కూడా ఇంజినీర్లుగా చెలామణి అవుతున్నారు అని కువైట్ ప్రభుత్వం గుర్తించింది.
    2. కుబైట్ సొసైటీ ఆఫ్ ఇంజినీరింగ్ ( KSE )ఇప్పటి వరకు ఇలా 3,000 మంది అభ్యర్థనలను నిరాకరించింది అని సమాచారం
NRI News Kuwait: భారత ఇంజినీర్ల కు NOC రద్దు

భారత ఇంజినీర్ల ( Indian Engineer ) కోసం కువైట్ ప్రభుత్వం ( Kuwait Govt ) NOC రద్దు చేసింది. కువైట్ ప్రభుత్వం ఇలా చేయడానికి కారణం.. నకిలీ డాక్యుమెంట్స్ వినియోగించి వర్క్ పర్మిట్ సాధించిన కేసులు ఈ మధ్యా చాలా నమోదు అయ్యాయి. ఇది గమనించి ఎన్ ఓ సి రద్దు చేసింది ప్రభుత్వం. సోసైటీ అఫ్ ఇంజినీరింగ్ అండ్ పబ్లిక్ ఆధారిటీ ఫర్ మ్యాన్ పవర్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించింది. తగిన స్టాండర్ట్ లేని వారిని ఇంజినీర్లుగా గుర్తించడానికి నిరాకరించిన కొంత మంది భారతీయులు కూడా ఇంజినీర్లుగా చెలామణి అవుతున్నారు అని కువైట్ ప్రభుత్వం గుర్తించింది.

ప్రాధమిక దర్యాప్తులో తేలిన విషయం ఏంటంటే నకిలీ డాక్యమెంట్స్ కోసం ప్రభుత్వం ఏజెన్సీలకు చెందిన స్టాంప్ లను వినియోగించారు అని తేలింది. ఇలా నకిలా డాక్యమెంట్స్ తో వచ్చిన వారికి వారి నిజం తెలిసినా కానీ కొన్ని సంస్థలు వారికి వర్క్ పర్మిట్  గడువు పెంచిందని తెలిసింది. కుబైట్ సొసైటీ ఆఫ్ ఇంజినీరింగ్ ( KSE )ఇప్పటి వరకు ఇలా 3,000 మంది అభ్యర్థనలను నిరాకరించింది అని సమాచారం. IPL 2020: పది సెకన్ల ప్రకటన కోసం అన్ని లక్షలా ?

 

Trending News