భారత్ చేరుకున్న 38 ఇండియన్ల మృత‌దేహాలు

ఇరాక్‌ దేశంలో అపహరణకు గురై ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన 38 మంది ఇండియన్ల మృత‌దేహాలు ఎట్టకేలకు అమృత్‌స‌ర్ చేరుకున్నాయి. 

Last Updated : Apr 2, 2018, 08:14 PM IST
భారత్ చేరుకున్న 38 ఇండియన్ల మృత‌దేహాలు

ఇరాక్‌ దేశంలో అపహరణకు గురై ఐసిస్ ఉగ్రవాదుల చేతిలో మరణించిన 38 మంది ఇండియన్ల మృత‌దేహాలు ఎట్టకేలకు అమృత్‌స‌ర్ చేరుకున్నాయి. సోమవారం ఇరాక్ నుండి ప్రత్యేక  విమానంలో అవి భారత్‌కు వచ్చాయి. ఈ మేరకు కేంద్రమంత్రి వీకే సింగ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున తగిన విధంగా నష్టపరిహారాన్ని తాము ఇస్తామని ఆయన అన్నారు. 

ఇరాక్ హత్యగావింపబడిన వారిలో 27 మంది పంజాబీయులు ఉన్నారు. మిగతా వారు హిమాచల్ ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాలకు చెందినవారు. వారి కుటుంబాలకు రూ.5 లక్షల రూపాయల చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.  ఇరాక్ ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం డీఎన్ఏ పరీక్షలు అన్నీ కూడా నిర్వహించి మరీ.. మృత‌దేహాలను భారత్‌కు అప్పగించింది. 2014లో ఓ  ప్రాజెక్టు పని మీద ఇరాక్‌లోని మోసుల్ ప్రాంతానికి జాబ్ చేయడానికి వచ్చిన భారతీయ కార్మికులను ఐసిస్ ఉగ్రవాదులు బంధించారు

ఇటీవలే కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఐసిస్ అఘాయిత్యాలకు బలైన భారతీయులు గురించి తెలిపారు. వారు ప్రాణాలు కోల్పోయారని.. వారి మృత‌దేహాలను వెలికితీయడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఇటీవలే ఇరాక్‌లో మార్టేయర్స్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో ప్రభుత్వం వారి మృత‌దేహాలను వెలికితీసింది. ఆ తర్వాత వాటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. 

Trending News