Winter Home Remedies: సీజన్ మారగానే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడుతుంటాయి. ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. కారణం ఇమ్యూనిటీ తగ్గడమే. సీజన్ మారగానే జలుబు, జగ్గు వంటి సమస్యలు ఎదురౌతుంటాయి. మందులు వాడటం వల్ల దుష్పరిణామాలు ఎదురుకావచ్చు. అయితే కొన్ని హోమ్ రెమిడీస్ వాడటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
ఉప్పు నీటితో గరగర గొంతు గరగర, ఇన్ఫెక్షన్ దూరం చేసేందుకు గోరువెచ్చని నీటిలో ఉప్పు కలిపి గరగర చేయాలి. రాత్రి పడుకునే ముందు ఉదయం లేవగానే చేయడం వల్ల మంచి ఫలితాలుంటాయి.
పసుపు పాలు పసుపులో యాంటీ సెప్టిక్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఒక గ్లాసు పాలలో చిటికెడు పసుపు కలిగి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల వివిధ రకాల వ్యాధుల్నించి రక్షణ లభిస్తుంది.
ఆవిరి తీసుకోవడం చలికాలంలో జలుబు కారణంగా ముక్కు క్లోజ్ అయి చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనికోసం నీలగిరి ఆయిల్ మిక్స్ చేసి ఆవిరి తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. ముక్కు రంధ్రాలు తెర్చుకుంటాయి.
తులసి లవంగం టీ తులసి, లవంగంకు ఆయుర్వేద వైద్య విధానంలో చాలా ప్రాధాన్యత ఉంది. తులసీ ఆకులు, లవంగం నీళ్లలో ఉడికించి కొద్దిగా తేనె కలిపి సేవించాలి. దీనివల్ల జలుబు, జగ్గు సమస్యలు దూరమవడమే కాకుండా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.
అల్లం తేనె మిశ్రమం అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఫలితంగా జలుబు దూరమౌతుంది. ఒక స్పూన్ అల్లం రసం తీసుకుని అందులో తేనె కలుపుకుని రోజుకు 2-3 సార్లు సేవించాలి. ఇలా చేస్తే గొంతు గరగరతో పాటు సీజనల్ ఇన్ఫెక్షన్లు దూరమౌతాయి