Tollywood Highest Pre Release Business Movies: ‘దేవర’ సహా తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు..

Tollywood Highest Pre Release Business Movies: ‘బాహుబలి’ సినిమాతో తెలుగు సినిమాల స్థాయి పెరిగింది. అంతేకాదు ఇక్కడ స్టార్ హీరోలందరు ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొడుతున్నారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర’ మూవీ పెద్ద స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. మొత్తంగా తెలుగు టాప్ 10 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాల  విషయానికొస్తే..

 

1 /10

RRR (రౌద్రం రణం రుధిరం) ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో రూ.191 కోట్ల బిజినెస్ చేసింది. ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

2 /10

కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో  ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ మూవీ తెలుగు రాష్ట్రాల్లో రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

3 /10

బాహుబలి 2 రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లోనే రూ. 122 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ చేసింది.  

4 /10

సలార్.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ తెలుగు స్టేట్స్ లో  రూ. 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

5 /10

సాహో.. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సాహో’ మూవీ తెలుగు స్టేట్స్ లో రూ. 121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.ప్రపంచ వ్యాప్తంగా రూ. 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

6 /10

ఆదిపురుష్.. ప్రభాస్ ప్రభు శ్రీరాముడిగా నటించిన సినిమా ‘ఆదిపురుష్’. ఈ మూవీ తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో రూ. 120 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ మూవీ రూ. 240 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

7 /10

రాధే శ్యామ్.. ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సినిమా ‘రాధే శ్యామ్’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లో 105.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

8 /10

సైరా నరసింహారెడ్డి.. చిరంజీవి ఫస్ట్ టైమ్  చారిత్రక యోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. ఈ చిత్రం అప్పట్లోనే తెలుగు రాష్ట్రాల్లో రూ. 106.8 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 187.25 కోట్ల బిజినెస్ చేసింది.

9 /10

దేవర పార్ట్ -1.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘దేవర పార్ట్ -1’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 112.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రూ. 182.55 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.

10 /10

పుష్ఫ పార్ట్ -1.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప పార్ట్ -1’. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 101.75 కోట్ల  ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 144.9 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.