Fighting Over 7 Gol Gappas For Rs 10 issue : వీధి వ్యాపారుల వద్ద ఎవరైనా ఏదైనా కొంటే.. అందుకు సరైన బేరం కుదుర్చుకునేందుకు బేరసారాలు ఆడటం, వాదించడం అనేది చాలా సందర్భాల్లో చాలా చోట్లా తరుచుగా కనిపించేదే. ఇంకొన్నిసార్లు ఆ వాగ్వాదం తారాస్థాయికి చేరి తగవులాడుకునే వరకు కూడా వెళ్తుంటాయి. ఐతే ఈ బేరసారాలన్నీ కూడా ఏదో ఒక వస్తుసామాగ్రి, బట్టలు వంటివి విక్రయించే వ్యాపారులతోనే బేరసారాలు జరుగుతుంటాయి కానీ తినేటటువంటి చిరుతిళ్లు, ఇతర ఆహార పదార్థాలు అమ్మే వారి వద్ద కాదు.
కానీ ఇదిగో మనం చూడబోయే ఈ వీడియోలో కనిపిస్తున్న ఇద్దరు యువకులు మాత్రం అలా కాదు.. కేవలం పానీ పూరి వద్ద మొదలైన వాగ్వాదం ఆ తరువాత భారీ ఘర్షణకు దారితీసింది. అది ఎంతలా అంటే.. ఒకరినొకరు నడిరోడ్డుపై కిందపడేసి కొట్టుకునేంత వరకు వెళ్లింది. వాళ్లిద్దరి ముష్టి యుద్ధం చూసిన ప్రత్యక్ష సాక్షులు ఆ ఘటనను తమ మొబైల్ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాపం వీధిలో పాని పూరి అమ్ముకునే ఓ చాట్ బండార్ నిర్వాహకుడితో మరో యువకుడు ఘర్షణకు దిగడమే కాకుండా అతడిపై దాడికి పాల్పడ్డాడు. ఉత్తర్ ప్రదేశ్ లోని హమీర్పూర్ లో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే.. ఆ చాట్ బండార్ అమ్మే యువకుడు రూ. 10 కి 7 పానీపూరీలు అందిస్తున్నాడు. కానీ అవి తినడానికి వచ్చిన మరో యువకుడు మాత్రం పది రూపాయలకు కేవలం 7 పానీపూరీలే ఇవ్వడం ఏంటంటూ వాగ్వాదానికి దిగాడు. ఆ వాదన కాస్తా శృతిమించి కొట్టుకునే వరకు వెళ్లింది.
Kalesh b/w a Golgappa seller and Customer over 10rs me 7 golgappa hi kyu? pic.twitter.com/kpa0kIeiQ8
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 30, 2023
ఇది కూడా చదవండి : Snake Viral Video: కోపంలో తనను తానే కాటు వేసుకున్న పాము.. భయంకరమైన వీడియో చూశారా..!
ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఘర్ కే కలేష్ అనే ఎక్స్ ( గతంలో ట్విటర్ ) యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. పది రూపాయలకు 7 పానీ పూరీలు ఇస్తావా అనే అర్థం వచ్చేలా క్యాప్షన్ పెట్టాడు. ఈ వీడియో చూసిన చాలామంది నెటిజెన్స్ తమదైన స్టైల్లో స్పందించారు. కొంతమంది ఆ వీధి వ్యాపారికి మద్దతుగా నిలిస్తే.. ఇంకొంతమంది ఆ వీధి వ్యాపారి గోల్ గప్పా తినడానికి వచ్చే వారిని మోసం చేస్తున్నాడు అని తమ తమ అభిప్రాయాలు రాసుకొచ్చారు. అన్నట్టు గోల్ గప్పా అంటే తెలిసిందే కదా... మనం హైదరాబాద్ లో పానీ పూరితో పిలుచుకునే ఒక రకమైన స్ట్రీట్ ఫుడ్ పేరే ఈ గోల్ గప్పే. ఉత్తరాదిని గోల్ గప్పే అని పిలుస్తారు.
ఇది కూడా చదవండి : Sister Ties Rakhi to Brother's deadbody: అన్నయ్య శవానికి రాఖీ కట్టిన చెల్లి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
7 Gol Gappas For Rs 10: పానీ పూరి కాడ పంచాయతీ.. పడేసి పడేసి కొట్టుకున్నారు