అమితాబ్ బచ్చన్ తన సతీమణి జయా బచ్చన్‌తో కలిసి భోపాల్‌కి వెళ్లినప్పుడు ఒక చిన్నారిని కలిశారట. ఆ బాలుడు అమితాబ్‌ని ఓ కోరిక కోరుతూ " నాకు మీ ఆశీర్వాదం ఇవ్వండి.. పెద్దయ్యాక మీ అంత వాడిని
అవ్వాలి నేను" అనగానే, అమితాబ్ వెంటనే రియార్టయ్యారట. "లేదు.. లేదు.. నాలా అయితే .. ఇప్పుడు నాలా చాలా కష్టమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది" అన్నారట. ఇలాంటి ఛలోక్తులు వేయడం అమితాబ్‌కు
పరిపాటే. అయితే ఆ బాలుడితో జరిగిన ముచ్చటను అమితాబ్ తన ఫేస్ బుక్ పోస్టు ద్వారా కూడా పంచుకోవడం విశేషం.