Samosa Business Income: నెలకు రూ.30 లక్షల జీతం వద్దనుకుని.. రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్న జంట

Samosa Business Income: సమోసాలు అమ్మి రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారంటే నమ్ముతారా ? అది కూడా నెలకు రూ. 30 లక్షల జీతం వచ్చే ఉద్యోగం వదిలేసుకుని మరీ సమోసాలు అమ్ముతున్నారంటే నమ్ముతారా ? బెంగళూరులో సమోసా సింగ్ బిజినెస్ గురించి వింటే ఎవరైనా నమ్మితీరాల్సిందే..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2023, 09:42 AM IST
Samosa Business Income: నెలకు రూ.30 లక్షల జీతం వద్దనుకుని.. రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్న జంట

Samosa Business Income: సమోసాలు అమ్మేవారిని చిన్న చూపు చూస్తున్నారా..? ఈ వార్తను చదివితే మీ దృక్పథం మారిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ఎవ్వరినీ తక్కువ అంచనా వేయొద్దు. 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' అనేది ఇక్కడ ఒక అంశం కాగా. ఎవరు, ఎంత కష్టపడి పనిచేసినా.. ఎండ్ ఆఫ్ ది డే రోజుకు ఎవరు ఎంత సంపాదిస్తున్నారు అని లెక్కలేసుకునే కమెర్షియల్ కాంక్రిట్ జంగిల్ మనది. అవును మరి.. చేసే పని ఏదైతేనేం.. నీతిగా, న్యాయంగా కష్టపడి పనిచేస్తే చాలు అనుకునే వారికి కొదువే లేదు. అలా అనుకునే గొప్పగొప్ప ఉద్యోగాలను కూడా తృణప్రాయంగా భావించి వదిలేసి చిన్న చిన్న బిజినెస్ లు ప్రారంభించిన ఎంతో మంది నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెట్టడం మీ వంతు అవుతుంది. అలాంటి ఒక జంట గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. 

ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న దంపతుల పేర్లు శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్. ఈ ఇద్దరూ హర్యానాలో బయోటెక్నాలజీ చేసేరోజుల్లో పరిచయం అయ్యారు. ఇద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారి పెళ్లి చేసుకున్నారు. ముందుగా నిధి ఓ కార్పొరేట్ కంపెనీలో నెలకు రూ. 17 వేల ఉద్యోగంలో చేరింది. ఆ తరువాత ఆమె స్టార్ తిరిగి గురుగ్రామ్ లోని ఓ ఫార్మా కంపెనీలో బిజినెస్ డెవలప్ మెంట్ అసోసియేట్ గా రూ. 30 లక్షల ప్యాకేజీతో జాక్ పాట్ లాంటి జాబ్ ఆఫర్ కొట్టేసింది. 

మరోవైపు ఆమె భర్త శిఖర్ వీర్ సింగ్ కెరీర్లో సైంటిస్ట్ అయ్యే లక్ష్యంతో ముందుకెళ్లాడు. హర్యానాలో బీటెక్ పూర్తిచేశాకా హైదరాబాద్ లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లో ఎంటెక్ పూర్తిచేశాడు. కానీ ఉన్నట్టుండి వాళ్ల ఆలోచనలను, కెరీర్ ని ఓ పిల్లాడి ఏడుపు మరో మలుపు తిప్పిందట. అంతే.. లక్షల పారితోషికం ఉన్న తమ ఉద్యోగాలకు గుడ్ బై చెప్పి బెంగళూరులో "సమోసా సింగ్" పేరిట సమోసాలు తయారు చేసి అమ్మే బిజినెస్ ప్రారంభించారు. అదేంటి నెలకు 30 లక్షల జీతం వచ్చే జాబ్ కాదునుకుని సమోసాలు అమ్మడం ఏంటని అనుకుంటున్నారా..? అలాగని వాళ్ల సంపాదనని తక్కువ అంచనా వేయొద్దు. ఇప్పుడు వాళ్లిద్దరూ రోజుకు రూ. 12 లక్షలు సంపాదిస్తున్నారు. 

ఉద్యోగాలు చేయడం కంటే సొంతంగా ఏదైనా బిజినెస్ స్థాపించి వ్యాపారంలో పేరు తెచ్చుకోవాలన్న తపనతో ఈ జంట 2015 లో తమ ఉద్యోగాలు వదిలేసి సమోసాలు అమ్మే బిజినెస్ ప్రారంభించింది. సమోసాలు అమ్మాలన్న బిజినెస్ ఐడియా శిఖర్ వీర్ సింగ్‌దేనట. సమోసాల బిజినెస్ ఐడియాను ముందుగా శిఖర్ వీర్ సింగ్ ప్రాతిపాదిస్తే అందుకు భార్య నిధి సింగ్ నో చెప్పిందట. కానీ ఒక రోజు సరదాగా బయటికి వెళ్లిన ఆ ఇద్దరికీ ఓ ఫుడ్ కోర్ట్ వద్ద ఒక పిల్లాడు సమోసా కోసం అల్లరి చేస్తూ కనిపించాడట. సమోసా కోసం ఆ పిల్లాడు ఏడిచే తీరు చూశాకే వాళ్ల దృష్టి మళ్లీ సమోసా వైపు మళ్లింది. అలా మొదలైన హాట్ హాట్ సమోసా బిజినెస్ ఇప్పుడు ఫుడ్ బిజినెస్ వర్గాల్లో ఓ హాట్ టాపిక్ అయ్యింది.

ఇది కూడా చదవండి : Goat Milk Ice Cream: మేక పాలతో ఐస్ క్రీమ్.. రోజుకు రూ. 10 లక్షలు సంపాదన

ఇది కూడా చదవండి : Hyundai Cars on Discount: కొత్త కారు కొనేవారికి గుడ్ న్యూస్.. హ్యూందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

More Stories

Trending News