Road Accident Viral Video: తమ్మి భూమ్మీద నూకలు ఇంకా ఉన్నాయ్ రా! వర్షంలో స్కిడ్ అయిన బైక్.. వెనకాలే వేగంగా వచ్చిన ట్రక్కు.. ఏం జరిగింది..?

Speedy Biker Skidded On Road Narrowly Escaped from Truck: వర్షం కురిసేటప్పుడు రోడ్డుపై వెళ్లే వాహనాలు సడెన్ బ్రేక్ వేసినా లేదా కొంచెం పక్కకు మలిపినా అవి స్కిడ్ అయి పడిపోవడం మీరు కూడా చూసే ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఇలాంటి ఇబ్బందులను స్వయంగా ఎదుర్కున్న అనుభవం కూడా ఉండే ఉంటుంది. అలాంటి వాళ్లకు ఈ వీడియో చూస్తే వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. 

Written by - Pavan | Last Updated : Apr 9, 2023, 09:15 AM IST
Road Accident Viral Video: తమ్మి భూమ్మీద నూకలు ఇంకా ఉన్నాయ్ రా! వర్షంలో స్కిడ్ అయిన బైక్.. వెనకాలే వేగంగా వచ్చిన ట్రక్కు.. ఏం జరిగింది..?

Speedy Biker Skidded On Road Narrowly Escaped from the Truck: భూమి మీద నూకలు బాకీ ఉండాలే కానీ ఎంతటి ప్రమాదాన్ని అయినా జయించి బయట పడొచ్చు అని పెద్దలు చెబుతుంటే వింటుంటాం కదా.. ఇప్పుడు మీరు చూడబోయే ఈ వైరల్ వీడియో కూడా అలాంటిదే. భారీ వర్షం పడుతోంది. ఎంత జోరున వాన పడినా రోడ్డుపై వెళ్లే వాహనాలకు కొదువే ఉండదు కదా.. ఎవ్వరి పని వారిది.. ఎవ్వరి వేగం వారిది. అదే విధంగా ఇప్పుడు మీరు చూడబోయే ఈ దృశ్యంలో కూడా జోరున కురుస్తున్న వానలోనే రోడ్డుపై వాహనాలు వెళ్తున్నాయి. ఉన్నట్టుండి ఓ ద్విచక్ర వాహనం రోడ్డుపై స్కిడ్ అయిపడిపోయింది. ఆ ద్విచక్రవాహనంపై ఉన్న వాహనదారుడు కిందపడిపోయాడు. కళ్లుమూసి తెరిసేంతలోపే వెనకాలే భారీ డీసీఎం ట్రక్ వాహనం వచ్చింది. ద్విచక్ర వాహనం పడిందని గ్రహించి బ్రేక్స్ వేసే లోపే ఆ భారీ ట్రక్కు కూడా పడిపోయిన వాహనంపై నుంచే దాటుకుని ముందుకు వెళ్లిపోయింది.

ఆ భారీ ట్రక్కు డ్రైవర్ అయితే దాదాపు యాక్సిడెంట్ అయిపోయిందనే భయంతో గుండె చేతపట్టుకుని గట్టిగా బ్రేక్స్ అప్లై చేశాడు. కీసుమంటూ శబ్ధం చేసుకుంటూ ట్రక్కు ఆగిపోయింది. కానీ అక్కడే ఒక మిరాకిల్ చోటుచేసుకుంది. ద్విచక్రవాహనదారుడి సమయస్పూర్తితో క్షణ కాలంలో ప్రమాదం తప్పింది. ఇంకా చెప్పాలంటే అది క్షణ కాలం కూడా కాదు... రెప్పమూసి తెరిసెలోగా అంటారు చూడండి.. అలా అందరూ చూస్తుండగానే రెప్పపాటులో అతడు ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ దృశ్యం చూస్తే.. అతడు పడిన చోటు నుంచి లేచి వేగంగా పక్కకు పెరిగెత్తి ఆ ట్రక్కు కింద పడి నలిగిపోకుండా అతడే, తనని తాను కాపాడుకున్నాడా లేక ఆ దేవుడే అతడిని ప్రమాదంలోంచి బయటపడేశాడా అనే సందేహం రాకమానదు. 

ఇది కూడా చదవండి : Monkey Funny Video: వీడియో కోసం కోతికి అన్నం పెట్టింది.. ఏం జరిగిందో చూస్తే నవ్వాపుకోలేరు

చూశారు కదా ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ దృశ్యం.. ఇలాంటి రోడ్డు ప్రమాదాన్ని చూసిన వాళ్లకే కాసేపు కాళ్ల కింద భూమి కదిలినట్టయితే.. ఇక ఆ రోడ్డు ప్రమాదం బారినపడిన వారికి ఇంకెలా ఉంటుంది చెప్పండి. కళ్ల ముందే చావు తన దగ్గరిదాకా వచ్చి వార్నింగ్ ఇచ్చి మరీ పోయినట్టుంటుంది కదూ.

ఈ ఘటన జరిగిన చోటే రోడ్డు పక్కనే పార్క్ చేసి ఉన్న వాహనం డ్యాష్ బోర్డు కెమెరాలో ఈ దృశ్యం మొత్తం రికార్డయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు.. మరీ ముఖ్యంగా వర్షం కురిసే సందర్భంలో రోడ్డుపై ప్రయాణం వీలైనంత వరకు వాయిదా వేయడమే ఉత్తమం. ఎంతో తప్పనిసరి అయితే తప్ప వర్షం వాహనాలు డ్రైవ్ చేయకూడదని ఈ వైరల్ వీడియో చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. లేదంటే ప్రమాదం ఏ రూపంలో వచ్చేది తెలియదు కదా.. అందరికీ ఇలా అదృష్టం ఉండాలని కూడా లేదు.

ఇది కూడా చదవండి : Mother Buffalo Fights with Lions: 'తల్లిని మించిన యోధుడు' లేడు.. ఈ గూస్‌బంప్స్ వీడియో చూస్తే మీరే ఒప్పుకుంటారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News